నార్వే చెస్ 2026 (Norway Chess 2026) టోర్నమెంట్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు(Praggnanandhaa) తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government) ఘన సత్కారం నిర్వహించింది. చెన్నైలోని ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి (Chief Minister) జోసెఫ్ విజయ్ (Joseph Vijay) ప్రజ్ఞానందను అభినందించి, తమిళనాడు క్రీడాభివృద్ధి సంస్థ తరఫున రూ.50 లక్షల నగదు బహుమతిని అందజేశారు.
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச.ஜோசப் விஜய் அவர்கள் இன்று (8.6.2026) தலைமைச் செயலகத்தில் நார்வே தலைநகர் ஆஸ்லோவில் நடைபெற்ற நார்வே செஸ் 2026 தொடரில் முதல் இந்தியராகப் பட்டத்தை வென்று, வரலாற்றுச் சாதனை படைத்த கிராண்ட்மாஸ்டர் ஆர். பிரக்ஞானந்தாவிற்கு, தமிழ்நாடு விளையாட்டு… pic.twitter.com/xkJ92gsDZ8
— CMOTamilNadu (@CMOTamilnadu) June 8, 2026
నార్వే చెస్ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారతీయ చెస్ ఆటగాడిగా చరిత్ర సృష్టించిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద ప్రతిభను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ సత్కారాన్ని నిర్వహించింది. ప్రపంచ చెస్ వేదికపై వరుస విజయాలతో దూసుకెళ్తున్న ప్రజ్ఞానందకు ఈ గౌరవం మరింత ప్రత్యేకంగా మారింది.
ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన కూడా చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్‌తో ప్రజ్ఞానంద సరదాగా చెస్ ఆడగా, ఆ మ్యాచ్‌లో కూడా గ్రాండ్‌మాస్టర్ తన ఆధిపత్యాన్ని చూపించాడు. సీఎం విజయ్‌కు చెక్‌మేట్ (Checkmate) ఇవ్వడంతో అక్కడ ఉన్నవారు చప్పట్లతో ప్రజ్ఞానందను అభినందించారు.
ఈ సత్కార కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో తమిళనాడుకు, భారతదేశానికి ప్రజ్ఞానంద తీసుకొచ్చిన గౌరవాన్ని కొనియాడింది.
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச.ஜோசப் விஜய் அவர்கள் இன்று (8.6.2026) தலைமைச் செயலகத்தில், நார்வே தலைநகர் ஆஸ்லோவில் நடைபெற்ற நார்வே செஸ் 2026 தொடரில் முதல் இந்தியராகப் பட்டத்தை வென்று, வரலாற்றுச் சாதனை படைத்த கிராண்ட்மாஸ்டர் ஆர். பிரக்ஞானந்தாவிற்கு உயரிய ஊக்கத் தொகையாக… pic.twitter.com/70mQS6flmc
— CMOTamilNadu (@CMOTamilnadu) June 8, 2026
ఇటీవల నార్వే రాజధాని ఒస్లోలో జరిగిన నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శన కనబరిచాడు. చివరి రౌండ్‌లో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌పై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు. వరుసగా 4 క్లాసికల్ గేమ్‌లలో విజయం సాధించడం అతని కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ఘనతల్లో ఒకటిగా నిలిచింది.
ఈ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్-1 మాగ్నస్ కార్ల్సన్, ప్రపంచ ఛాంపియన్ గుకేష్(Gukesh), అలిరెజా ఫిరూజ్జా(Alireza Firouzja), వెస్లీ సో(Wesley So), విన్సెంట్ కీమర్(Vincent Keymer) వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొన్నారు. ఫిరూజ్జా, కార్ల్సన్, గుకేష్, కీమర్‌లపై ప్రజ్ఞానంద సాధించిన విజయాలు టైటిల్ రేసులో కీలకంగా మారాయి.
ముఖ్యంగా స్వదేశంలో ఆడుతున్న మాగ్నస్ కార్ల్సన్‌ను 2 సార్లు ఓడించడం టోర్నమెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. ప్రపంచ చెస్ దిగ్గజంపై సాధించిన ఈ డబుల్ విక్టరీతో ప్రజ్ఞానంద పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. ఇక అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో 2వ స్థానంలో నిలవగా, మాగ్నస్ కార్ల్సన్ 4వ స్థానంతో టోర్నమెంట్‌ను ముగించాడు.
#WATCH | Chennai | Tamil Nadu CM Vijay meets Indian Grandmaster R Praggnanandhaa and awards him Rs 50 lakh on behalf of the Sports Development Authority of Tamil Nadu after the chess player won the Norway Chess 2026 title.
— ANI (@ANI) June 8, 2026
(Source: TNDIPR) pic.twitter.com/Lf4dNgYrEX






