---Advertisement---

ఏపీ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. ఏ నగరానికి ఏ కేటగిరీ దక్కిందంటే?

October 12, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 17 నగరపాలక సంస్థలు, 106 మున్సిపాలిటీలకు సంబంధించి రిజర్వేషన్ల కసరత్తు పూర్తయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, జనరల్‌, అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీల వారీగా స్థానాలను కేటాయిస్తూ అధికారులు తుది జాబితాను విడుదల చేస్తున్నారు.

నగరపాలక సంస్థల రిజర్వేషన్లు:

ఎస్టీ జనరల్‌: మంగళగిరి

ఎస్సీ మహిళ: కర్నూలు

ఎస్సీ జనరల్‌: రాజమహేంద్రవరం

బీసీ మహిళలు: మచిలీపట్నం, కాకినాడ

బీసీ జనరల్‌: చిత్తూరు, అనంతపురం, ఏలూరు

జనరల్‌ మహిళలు: శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్సార్‌ కడప, గుంటూరు, కడప, గ్రేటర్‌ విశాఖపట్నం

అన్‌రిజర్వ్‌డ్‌: ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ

106 మున్సిపాలిటీల రిజర్వేషన్లు:

ఎస్టీ మహిళ: గూడూరు

ఎస్టీ జనరల్‌: ఆత్మకూరు, ఆలూరు

ఎస్సీ మహిళలు: కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, చింతలపూడి, సూళ్లూరుపేట, గుత్తి, చీరాల

ఎస్సీ జనరల్‌: ఉయ్యూరు, నూజివీడు, కుప్పం, సామర్లకోట, పిఠాపురం, బాపట్ల, పొదిలి

బీసీ మహిళలు: జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, నాయుడుపేట, చిలకలూరిపేట, ఇచ్ఛాపురం, కొవ్వూరు, పాలకొల్లు, గుంతకల్లు, గుడివాడ, నందిగామ, ముమ్మిడివరం, మదనపల్లె, నరసరావుపేట, అమలాపురం

బీసీ జనరల్‌: కావలి, కదిరి, బి.కొత్తకోట, కందుకూరు, హిందూపురం, ఆత్మకూరు (నెల్లూరు), అద్దంకి, కమలాపురం, నెల్లిమర్ల, మడకశిర, ఆళ్లగడ్డ, గురజాల, దాచేపల్లి, గొల్లప్రోలు, మార్కాపురం, నంద్యాల, బేతంచెర్ల, నందికొట్కూరు, దర్శి, గూడూరు (కర్నూలు), మైదుకూరు, బద్వేలు

జనరల్‌ మహిళలు: కనిగిరి, వెంకటగిరి, నరసాపురం, పలాస-కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పాలకొండ, పొన్నూరు, భీమవరం, జగ్గయ్యపేట, బుచ్చిరెడ్డిపాళెం, ఎర్రగుంట్ల, యలమంచిలి, కల్యాణదుర్గం, ఆమదాలవలస, పుంగనూరు, మాచర్ల, రాజంపేట, ఆదోని, డోన్‌, రాజాం, బొబ్బిలి, రేపల్లె, పులివెందుల, ఎమ్మిగనూరు

అన్‌రిజర్వ్‌డ్‌: పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి, సాలూరు, తణుకు, తెనాలి, తాడేపల్లిగూడెం, రామచంద్రాపురం, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తుని, పార్వతీపురం, ప్రొద్దుటూరు, పుత్తూరు, మండపేట, నగరి, చీమకుర్తి, తిరువూరు, రాయదుర్గం, గిద్దలూరు, వినుకొండ, పెద్దాపురం, ధర్మవరం, తాడిగడప, పిడుగురాళ్ల, తాడిపత్రి.

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులకు ఈ రిజర్వేషన్లు కీలకంగా మారనున్నాయి. తుది జాబితా ప్రకారం ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించనున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment