---Advertisement---

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..

April 29, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Scam Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి(Dhanunjaya Reddy), కృష్ణమోహన్ రెడ్డి(Krishnamohan Reddy), బాలాజీ గోవిందప్పలకు(Balaji Govindappa) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.

లిక్కర్ స్కామ్ కేసులో ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేయవద్దంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు (High Court) మరింత పొడిగించింది. ఈ ఉత్తర్వులు జూన్ 24వ తేదీ వరకు అమల్లో ఉండనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

దీంతో ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులకు అరెస్టు భయం నుంచి తాత్కాలిక ఉపశమనం లభించినట్టైంది. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇక, నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా, వచ్చే నెల 6వ తేదీలోగా తమ కౌంటర్లు దాఖలు చేయాలని సిట్ అధికారులకు (SIT Officials) హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో, హైకోర్టు తదుపరి విచారణలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్న ఆసక్తి నెలకొంది. సిట్ దర్యాప్తు పురోగతి, నిందితుల వాదనలు ఆధారంగా తదుపరి పరిణామాలు ఉండే అవకాశం కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment