---Advertisement---

బాలల హక్కుల కోసం స్మృతి మంధాన కీలక అడుగు.. అభినందించిన సచిన్ టెండూల్కర్!

October 11, 2026

Summarize with AI

---Advertisement---

భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన (Smriti Mandhana) మరో కీలక బాధ్యత చేపట్టారు. చిన్నారుల హక్కులు(Children’s Rights), బాలికల సాధికారత(Girls’ Empowerment), లింగ సమానత్వం (Gender Equality) కోసం పనిచేసేందుకు యూనిసెఫ్ ఇండియా (UNICEF India) సెలబ్రిటీ అడ్వకేట్‌గా(Celebrity Advocate) నియమితులయ్యారు. బాలికలకు సమాన అవకాశాలు కల్పించడం, తమ కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించడం ఆమె లక్ష్యం.

స్మృతి కొత్త బాధ్యతపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన సచిన్.. క్రికెట్‌తో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఆమె, బాలల హక్కుల పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

తొమ్మిదేళ్ల వయసులో అన్నతో కలిసి సరదాగా క్రికెట్ ట్రయల్స్‌కు వెళ్లిన విషయాన్ని స్మృతి గుర్తుచేసుకున్నారు. తండ్రి క్రికెట్ ఆడేందుకు ప్రోత్సహించగా, తల్లి చదువు, ఆటల మధ్య సమతుల్యత పాటించేలా సహకరించారని తెలిపారు. నేడు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు.

ప్రతి అమ్మాయికి (Every Girl) తన కలలను ఎంచుకుని, వాటిని సాకారం చేసుకునే స్వేచ్ఛ ఉండాలని స్మృతి పేర్కొన్నారు. అమ్మాయి అనే కారణంతో ఏ రంగంలోనూ ఎదుగుదలకు అడ్డంకులు ఎదురుకాకూడదని స్పష్టం చేశారు. క్రికెట్‌లో యువతకు ఆదర్శంగా నిలిచిన ఆమె, ఇప్పుడు చిన్నారుల హక్కులు, బాలికలకు సమాన అవకాశాలపై అవగాహన పెంచేందుకు కృషి చేయనున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment