---Advertisement---

బండి భగీరథ్‌పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు …5 బృందాలుతో గాలింపు.

May 16, 2026

Summarize with AI

---Advertisement---

బండి భగీరథ్‌పై (Bandi Bhagirath) నమోదైన పోక్సో కేసులో (POCSO Case) కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసు తీవ్రత దృష్ట్యా భగీరథ్ దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు (Lookout Notices) జారీ చేశారు. ఈ చర్యతో కేసు దర్యాప్తు మరింత వేగం అందుకుంది.

భగీరథ్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా 5 బృందాలను (5 Special Teams) ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. హైదరాబాద్(Hyderabad), కరీంనగర్(Karimnagar), ఢిల్లీ (Delhi) ప్రాంతాల్లో భగీరథ్‌కు సంబంధించిన బంధువులు, స్నేహితుల ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అతడితో ఇటీవల టచ్‌లో ఉన్న వ్యక్తులపై కూడా పోలీసులు నిఘా పెంచినట్లు సమాచారం.

ఇప్పటికే భగీరథ్ ఫోన్ సిగ్నల్స్(Phone Signals), సోషల్ మీడియా యాక్టివిటీ(Social Media Activity), పరిచయ వర్గాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కేసుకు సంబంధించిన కీలక ఆధారాల కోసం అధికారులు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా బండి భగీరథ్ మరికొద్ది గంటల్లో పోలీసుల ఎదుట లొంగిపోవచ్చన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పోలీసులు మాత్రం భగీరథ్ కోసం తమ గాలింపును మరింత వేగవంతం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment