కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్‌పై (Bandi Bhagirath) మైనర్ బాలిక అత్యాచారం (Minor Girl Rape) ఆరోపణలతో పోక్సో కేసు (POCSO Case) నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 17 ఏళ్ల బాలికకు మద్యం తాగించి మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌తో (Moinabad Farmhouse) పాటు మరికొన్ని ప్రాంతాల్లో అత్యాచారం చేశారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో బాధితురాలికి న్యాయం చేయాల్సిన స్థానంలో, ఆమెపైనే హనీట్రాప్ (Honey Trap) ఆరోపణలు చేస్తూ ఎదురు కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) గత కొంతకాలంగా మహిళలు, బాధితురాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితులను పలువురు గుర్తు చేస్తున్నారు. అధికార పార్టీల నేతలపై ఆరోపణలు చేసిన మహిళలపైనే తిరిగి కేసులు పెట్టడం, సోషల్ మీడియా దాడులు చేయించడం, పోలీసు వేధింపులకు గురిచేయడం వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వచ్చాయని విమర్శకులు అంటున్నారు.
ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ (Nasir Ahmed) వ్యవహారంలో సూఫియా చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. బాధితురాలి కుటుంబం, వ్యక్తిగత జీవితం చుట్టూ కథనాలు నడిపి అసలు అంశాన్ని మళ్లించే ప్రయత్నం జరిగిందని విమర్శలు వచ్చాయి. అదే విధంగా జనసేన ఎమ్మెల్యే(Janasena MLA) అరవ శ్రీధర్‌పై (Arava Sreedhar) లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ప్రభుత్వ ఉద్యోగిణి వర్షిణిపై కూడా ఎదురు కేసులు పెట్టి బెదిరింపులకు దిగారనే ఆరోపణలు మహిళా సంఘాలు చేశాయి.
జనసేన నేత కిరణ్ రాయల్‌పై ఆరోపణలు చేసిన లక్ష్మి కేసులో కూడా బాధితురాలినే టార్గెట్ చేశారన్న విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై ఆరోపణలు చేసిన ప్రిన్సిపల్ సౌమ్యను సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేయడం, మానసిక వేధింపులకు గురిచేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ వరుస ఘటనల మధ్య ఇప్పుడు తెలంగాణలో బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణల కేసులో కూడా బాధితురాలిపైనే ఎదురు ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బాధిత మహిళల గొంతును అణచివేయడం, వారిపైనే కేసులు మోపడం అనే ధోరణి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ సంస్కృతిగా మారుతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.






