బంగ్లాదేశ్‌లో(Andhra Pradesh) మతపరమైన ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి వచ్చాయి. రాజధాని(Capital) ఢాకాలో (Dhaka) వేలాది మంది హిందువులు, విద్యార్థులు, సామాజిక సంస్థల ప్రతినిధులు భారీ ఆందోళన నిర్వహించారు. ఉత్తర బంగ్లాదేశ్‌లోని (Bangladesh) గైబాంధా Gaibandha) జిల్లాలో శ్రీరాముడి (Lord Rama) చిత్రాన్ని అవమానించారనే ఆరోపణలు, అలాగే నిర్మాణంలో ఉన్న భారీ శ్రీరామ విగ్రహ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిరసనలు చేపట్టారు. ఆందోళనల సందర్భంగా ఢాకా వీధులు “జై శ్రీరామ్”(Jai Shri Ram) నినాదాలతో మార్మోగాయి.
గైబాంధా జిల్లాలోని పలాష్‌బారి (Palashbari) ప్రాంతంలో సుమారు 81 అడుగుల ఎత్తుతో శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. దీనిని బంగ్లాదేశ్‌లోనే అతిపెద్ద శ్రీరామ విగ్రహంగా పేర్కొంటున్నారు. అయితే ఈ నిర్మాణాన్ని కొందరు ఇస్లామిక్ సంస్థలు (Islamic Organizations) వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ వివాదం మధ్య జరిగిన ఒక ప్రదర్శనలో శ్రీరాముడి చిత్రాన్ని చెప్పులతో కొట్టారని, అవమానించారని ఆరోపణలు వెలువడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో హిందూ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగింది.
ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు(Students) తొలుత టార్చ్‌లైట్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హిందూ విద్యార్థి సంఘాలు, మైనారిటీ హక్కుల సంస్థలు, పలు సామాజిక సంఘాల పిలుపుతో షాహ్‌బాగ్ ప్రాంతంలో భారీ నిరసన చేపట్టారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలని, మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న హిందూ విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి 72 గంటల గడువు విధించాయి. ఈ వ్యవధిలో శ్రీరాముడి చిత్రాన్ని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా మరింత విస్తృత స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించాయి.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గైబాంధాలో నిర్మాణంలో ఉన్న 81 అడుగుల శ్రీరామ విగ్రహ పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. తీవ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు వస్తుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ ఘటనతో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రత, మత స్వేచ్ఛ, మత సామరస్యంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. హిందూ, బౌద్ధ, క్రైస్తవ ఐక్య పరిషత్‌తో పాటు పలు మైనారిటీ సంఘాలు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మత విద్వేష ఘటనలను అరికట్టాలని, మైనారిటీలకు పూర్తి భద్రత కల్పించాలని కోరుతున్నాయి.






