---Advertisement---

బీసీసీఐ కీలక ప్రకటన.. క్యాంపా, ఎస్‌బీఐ లైఫ్‌, చాట్‌జీపీటీతో భారీ ఒప్పందం!

September 9, 2026

Summarize with AI

---Advertisement---

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన చేసింది. టీమిండియా (Team India) స్వదేశీ క్రికెట్‌ సీజన్‌కు(Home Cricket Season) క్యాంపా(Campa), ఎస్‌బీఐ లైఫ్‌(SBI Life), చాట్‌జీపీటీ(ChatGPT) సంస్థలను అసోసియేట్‌ పార్ట్‌నర్లుగా ప్రకటించింది. భారత్‌-వెస్టిండీస్‌ (India-West Indies) సిరీస్‌తో ప్రారంభమయ్యే ఈ భాగస్వామ్యం 2028 మార్చి వరకు, రెండు సీజన్ల పాటు కొనసాగనుంది.

ఈ మూడు ఒప్పందాల ద్వారా బీసీసీఐకి రూ.130 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. గత సైకిల్‌తో పోలిస్తే భాగస్వామ్యాల విలువ 44 శాతం పెరిగినట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో భారత క్రికెట్‌కు మార్కెట్‌లో ఉన్న భారీ డిమాండ్‌, బ్రాండ్‌ విలువ మరోసారి స్పష్టమైంది.

క్యాంపా, ఎస్‌బీఐ లైఫ్‌, చాట్‌జీపీటీ సంస్థలు వరుసగా పానీయాలు(Beverages), బీమా(Insurance), కృత్రిమ మేధ సాంకేతిక (Artificial Intelligence Technology) రంగాలకు చెందినవి. భారత క్రికెట్‌కు ఉన్న భారీ అభిమాన వర్గం ద్వారా ఆయా సంస్థలకు తమ బ్రాండ్‌లను మరింత విస్తృతంగా ప్రచారం చేసుకునే అవకాశం లభించనుంది.

ఈ భాగస్వామ్యాలపై బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌(Mithun Manhas) సంతోషం వ్యక్తం చేశారు. స్వదేశీ క్రికెట్‌ సీజన్‌ దేశంలో అత్యంత విలువైన క్రీడా వేదికల్లో ఒకటిగా కొనసాగుతోందని, భాగస్వామ్యాల విలువ 44 శాతం పెరగడం భారత క్రికెట్‌పై ప్రముఖ బ్రాండ్లు ఉంచుతున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.

బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్‌ సైకియా (Devajit Saikia) మాట్లాడుతూ.. రూ.130 కోట్లకు పైగా విలువైన తాజా ఒప్పందాలతో భాగస్వామ్యాల విలువ గణనీయంగా పెరిగిందన్నారు. ఇది బీసీసీఐ, టీమిండియాపై బ్రాండ్లకు ఉన్న నమ్మకాన్ని, భారత క్రికెట్‌కు ఉన్న వాణిజ్య డిమాండ్‌ను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment