---Advertisement---

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

July 18, 2026

Summarize with AI

---Advertisement---

రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్‌పై (Retirement) గత 24 గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు ఎట్టకేలకు బీసీసీఐ(BCCI) ఫుల్ స్టాప్ పెట్టింది. ఇంగ్లాండ్‌తో (England) జరిగే 3వ వన్డే తర్వాత రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు (International Cricket) గుడ్‌బై చెబుతాడంటూ ప్రచారం జోరుగా సాగినా.. అందులో ఎలాంటి నిజం (Truth) లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో రోహిత్ అభిమానులు భారీ ఊరట పొందుతున్నారు.

ఇంగ్లాండ్‌తో జరిగే 3వ వన్డేనే రోహిత్ శర్మ కెరీర్‌లో చివరి మ్యాచ్ అని, ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఈ ప్రచారానికి బీసీసీఐ తాజాగా చెక్ పెట్టింది.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) స్పందిస్తూ.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. లార్డ్స్‌లో (Lord’s) జరిగే వన్డే అతనికి చివరి మ్యాచ్ కాదని, భారత వన్డే జట్టులో రోహిత్ ఇప్పటికీ కీలక సభ్యుడేనని తెలిపారు.

భారత జట్టుకు అవసరమైనంత కాలం రోహిత్ శర్మ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడని దేవజిత్ సైకియా పేర్కొన్నారు. రోహిత్ నిజమైన లెజెండ్ అని ప్రశంసలు కురిపించారు. దీంతో రిటైర్మెంట్ వార్తలపై వచ్చిన సందేహాలన్నింటికీ తెరపడగా, అభిమానులు మరోసారి తమ అభిమాన క్రికెటర్‌ను మైదానంలో చూసే అవకాశంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment