ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) సోషల్ మీడియా (Social Media) వేదికగా మహిళలపై దూషణలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సతీమణి వైఎస్ భారతీరెడ్డి (YS Bharathi Reddy) తరచుగా ఈ ట్రోలోన్మాదులకి సాఫ్ట్ టార్గెట్‌గా మారుతున్నారు. అధికారపార్టీకి మద్దతు ఇస్తున్న కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ (Social Media Handles) ద్వారా రాజకీయాలతో సంబంధంలేని అంశాలపై ఆమెపై అసత్య ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
ఇటీవల జగన్ (Jagan) ప్రతిపాదించిన మావిగన్ (MAVIGUN) అంశం ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఆ దృష్టిని మళ్లించేందుకు వైఎస్ భారతీపై (YS Bharathi Reddy) మరోసారి దుష్ప్రచారం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2000 సంవత్సరంలో ఆమె జగన్‌పై కేసు వేసారంటూ పూర్తిగా ఆధారరహితమైన వార్తలను సృష్టించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు.
ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిన వైఎస్ భారతీరెడ్డి చట్టపరమైన చర్యలకు దిగారు. మెటా ప్లాట్‌ఫామ్స్ (Meta Platforms), ఎక్స్ కార్పొరేషన్(X Corporation), యూట్యూబ్ (YouTube), గూగుల్ (Google) వంటి ప్రముఖ సోషల్ మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు. అలాగే ఈ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా వేదికలు, సోషల్ మీడియా అకౌంట్లకు కూడా నోటీసులు జారీ చేశారు.
భారతీరెడ్డి తరఫున న్యాయవాది ప్రద్యుమన్ కైస్తా ఈ నోటీసులను పంపిస్తూ, ప్రచారంలో ఉన్న కంటెంట్ పూర్తిగా అసత్యమని, అది కుటుంబ పరువుకు తీవ్ర నష్టం కలిగించడమే కాకుండా వ్యక్తిగత గోప్యతను కూడా భంగపరుస్తోందని పేర్కొన్నారు. ఈ చర్యలు ప్రణాళికాబద్ధమైన దుష్ప్రచారం భాగమని ఆరోపించారు.
లీగల్ నోటీసుల్లో (Legal Notices) భాగంగా సంబంధిత సంస్థలు మరియు వ్యక్తులు తక్షణమే ఆ కంటెంట్‌ను తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రచారం చేయకుండా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇప్పటికే ప్రచురించిన తప్పుడు కథనాలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కూడా కోరారు. లేని పక్షంలో కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామం సోషల్ మీడియా బాధ్యత, వ్యక్తిగత గౌరవం, రాజకీయ దుష్ప్రచారం మధ్య ఉన్న సున్నితమైన రేఖను మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది.







