---Advertisement---

యాత్రికుల బస్సుకు ఘోర ప్రమాదం.. ముగ్గురు ఏపీవాసులు మృతి..పలువురికి తీవ్ర గాయాలు

June 8, 2026

---Advertisement---

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని 3 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఔరంగాబాద్ సమీపంలో లారీని ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన జరిగింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బస్సులో ప్రయాణిస్తున్న 3 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

అధికారుల వివరాల ప్రకారం ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 43 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ యాత్రికుల బస్సు ఈ నెల 1న నెల్లూరు నుంచి కాశీ యాత్రకు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు సంగం ప్రాంతానికి చెందినవారు కాగా, ఒక మహిళ ఆత్మకూర్‌కు చెందినదిగా గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment