రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలకు పరిష్కారాలు చూపకుండా, కొత్త కొత్త కార్యక్రమాల (New Programs) పేరుతో ప్రజల దృష్టిని (People Attention) మళ్లించే ప్రయత్నం జరుగుతోందంటూ సీఎం చంద్రబాబు నాయుడుపై (Nara Chandrababu Naidu) తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ (Super Six) హామీల అమలుపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్న వేళ, వెంటనే పీ4 పథకాన్ని (P4 Scheme) తెరపైకి తీసుకువచ్చి పేదలను సంపన్నులు దత్తత తీసుకోవాలనే ఆలోచనను ముందుకు తెచ్చారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
అలాగే రైతులకు (Farmers) సకాలంలో యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని వ్యవసాయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, వెంటనే యూరియా (Urea) ఎక్కువగా వాడితే క్యాన్సర్ (Cancer) వస్తుందనే ప్రచారం ప్రారంభమైందని అంటున్నారు. సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టకుండా బాధ్యతను రైతులపైనే మోపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) డీజిల్ కొరత (Diesel Shortage) తలెత్తి రవాణా రంగం స్తంభించిన పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వెంటనే ‘నా దేశం – నా బాధ్యత’(My Nation – My Responsibility) పేరుతో వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’(No Vehicle Day) పాటించాలని సూచించడం కూడా విమర్శలకు దారితీసింది.
ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రజలకి సమస్యలు తలెత్తినప్పుడల్లా అసలు సమస్యలను పక్కనపెట్టి కొత్త కార్యక్రమాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనంటూ రాజకీయ వర్గాలు సైతం చర్చించుకోవడం గమనార్హం.






