---Advertisement---

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..

April 25, 2026

Summarize with AI

---Advertisement---

స్వల్ప అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ (Andhra Pradesh Governor) ఎస్ అబ్దుల్ నజీర్‌ను (S. Abdul Nazeer) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తాజాగా పరామర్శించారు. ఈ సందర్భంగా లోక్ భవన్‌కు (Lok Bhavan) వెళ్లిన సీఎం చంద్రబాబు గవర్నర్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

గవర్నర్ త్వరగా కోలుకుని సాధారణ కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం ఆకాంక్షించారు. ఇద్దరి మధ్య కొంతసేపు మర్యాదపూర్వకంగా భేటీ జరిగినట్లు సమాచారం.

ఆకస్మిక అస్వస్థతతో ఆసుపత్రికి తరలింపు

ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో ఇబ్బంది పడటంతో వెంటనే తాడేపల్లిలోని(Tadepalli) ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో అత్యవసర విభాగంలో చేర్పించారు.

వైద్య పరీక్షల్లో కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని సూచించినట్లు తెలిసింది. అయితే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటంతో తర్వాత మళ్లీ ఆసుపత్రికి వస్తానని చెప్పి గవర్నర్ అక్కడి నుంచి విజయవాడకు వెళ్లారు.

ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు వెంటనే లోక్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment