చిత్తూరు జిల్లా (Chittoor District) బసరెడ్డిపల్లి సమీపంలో 1 లిక్కర్ వ్యాన్ (Liquor Van) బోల్తా పడిన ఘటన (Accident Incident) కలకలం రేపింది. మద్యం లోడుతో వెళ్తున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై (Road) బోల్తా పడటంతో అందులోని వందలాది మద్యం సీసాలు (Liquor Bottles) చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని బాటిళ్ల కోసం ఎగబడ్డారు.
లిక్కర్ సీసాలు కనిపించగానే జనాలు (People) ఎవరికివారు కార్టన్లకు కార్టన్లు ఎత్తుకెళ్లారు. లుంగీలు, టవల్లు, చీర కొంగుల్లో సీసాలు నింపుకుని పరుగులు తీశారు. ఆడా మగా తేడా లేకుండా అందరూ మద్యం సీసాలను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే అక్కడ ఉన్న ఎక్కువ భాగం బాటిళ్లు ఖాళీ అయ్యాయి.
ఇంత జరుగుతున్నా వ్యాన్ డ్రైవర్, క్లీనర్ పరిస్థితి ఎలా ఉందో చూసే ప్రయత్నం కూడా చాలామంది చేయకపోవడం గమనార్హం. మందు సీసాలు పోతే మళ్లీ దొరకవన్నట్టుగా జనం ఒకరిని ఒకరు తోసుకుంటూ సరుకు ఎత్తుకెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రావడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జనాలు మెల్లగా అక్కడి నుంచి జారుకోవడంతో కొన్ని మద్యం సీసాలు మాత్రం మిగిలాయి.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లిక్కర్ వ్యాన్ బోల్తా పడిన వెంటనే జనాలు బాటిళ్ల కోసం పోటీ పడిన తీరు చర్చనీయాంశంగా మారింది.






