తమిళనాడు (Tamil Nadu) కొత్త ముఖ్యమంత్రి (Chief Minister) తలపతి విజయ్ (Thalapathy Vijay) దేశ రాజధాని ఢిల్లీలో కీలక పర్యటన చేపట్టారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢిల్లీ (Delhi) వెళ్లిన విజయ్.. ఇవాళ ప్రధాని(Prime Minister) నరేంద్ర మోదీతో (Narendra Modi) పార్లమెంట్ భవనంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
సుమారు 1 గంటకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో తమిళనాడు అభివృద్ధికి (Tamil Nadu Development) సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు(Central Funds), పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులు(Development Projects), మౌలిక వసతుల విస్తరణ(Infrastructure Expansion), పరిశ్రమల అభివృద్ధి (Industrial Development) వంటి అంశాలను సీఎం విజయ్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
అలాగే కేంద్ర-రాష్ట్ర సంబంధాలను మరింత బలోపేతం చేయడం, తమిళనాడుకు ప్రత్యేక సహకారం అందించడం వంటి విషయాలపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు టీవీకే వర్గాలు వెల్లడించాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విజయ్ చేస్తున్న తొలి అధికారిక ఢిల్లీ పర్యటన కావడంతో రాజకీయ వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ప్రధానితో భేటీ అనంతరం సీఎం విజయ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో(Nirmala Sitharaman) కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్ర సహాయ నిధులు, కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలు ప్రాధాన్యంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన విజయ్.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా తన ప్రభావాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన తీసుకునే రాజకీయ నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయొచ్చని చర్చ జరుగుతోంది.








