---Advertisement---

ఆరేళ్ల ‘గొడ్డు చాకిరి’ తర్వాత ఇంత అవమానిస్తారా – పవన్ కళ్యాణ్ పై దాసరి రాము సంచలన వ్యాఖ్యలు

May 28, 2026

Summarize with AI

---Advertisement---

జనసేన (Jana Sena) అధినేత, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై కాపు నాయకుడు (Kapu Leader) దాసరి రాము (Dasari Ramu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌ను నమ్మి దాదాపు ఆరేళ్ల పాటు పనిచేశామని, చివరకు తమను అవమానించే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.

2024 ఎన్నికల సమయంలో అధికార భాగస్వామ్యం గురించి ప్రశ్నిస్తే “నన్ను నమ్మండి.. నాకు ఉపయోగం ఉంది” అంటూ పవన్ తమను ఒప్పించారని, కానీ చివరికి జనసేనకు(Jana Sena) వచ్చిన 21 సీట్లలో కూడా పది సీట్లు టీడీపీ(TDP) నుంచి వచ్చిన వారికే కేటాయించారని ఆరోపించారు. పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పనిచేసిన వారిని ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టారని దాసరి రాము ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక జనసేన పార్టీ సోషల్ మీడియా వ్యవస్థపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని లక్ష్యంగా చేసుకుని ఒక “సోషల్ మీడియా మాఫియా”(Social Media Mafia) పనిచేస్తోందని ఆరోపించారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని వ్యక్తిగతంగా దూషించడం, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడం, సోషల్ మీడియాలో భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు (Professor Nageswara Rao) వంటి వ్యక్తులను కూడా ఇదే విధంగా టార్గెట్ చేశారని ఆయన పేర్కొన్నారు.

తన పేరును వైసీపీ(YSRCP) నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) పేరుతో కలిపి పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం వెనుక ఉద్దేశం ఏమిటని దాసరి రాము ప్రశ్నించారు. తనను “వైసీపీ కోవర్ట్”(YSRCP Covert)గా ప్రజల్లో చూపించే ప్రయత్నం జరుగుతోందని, తాను ప్యాకేజీలకు అమ్ముడయ్యాననే భావన కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాను వైసీపీపై చేసిన విమర్శలను పవన్ పూర్తిగా మరిచిపోయారని అన్నారు.

2019 ఎన్నికల్లో కాపులు ఓట్లు వేయలేదని పవన్ పదేపదే మాట్లాడటం ద్వారా మొత్తం కాపు సమాజాన్ని అవమానిస్తున్నారని దాసరి రాము ఆరోపించారు. “2019 ఓటమి గుర్తుంది.. కానీ 2024లో గెలిపించిన విషయం గుర్తులేదా?” అంటూ ప్రశ్నించారు. అలాగే వంగవీటి రంగ (Vangaveeti Ranga) హత్య ఘటనను ప్రస్తావిస్తూ పవన్ మాట్లాడిన తీరు కాపు సమాజాన్ని కించపరిచేలా ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత “ఉంటే ఉండండి.. పోతే పోండి” అనే ధోరణితో పవన్ వ్యవహరిస్తున్నారని, ఇప్పుడు తమ కులం పేరే ఎత్తి అవమానిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment