---Advertisement---

లోన్ తీసుకున్నవారికి బ్యాడ్ న్యూస్.. రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ!

October 7, 2026

Summarize with AI

---Advertisement---

ఆర్‌బీఐ(RBI) రెపో రేటును (Repo Rate) 25 బేసిస్ పాయింట్లు (25 Basis Points) పెంచడంతో 5.25 శాతంగా ఉన్న రేటు 5.50 శాతానికి చేరింది. ఈ నిర్ణయంతో హోమ్ లోన్(Home Loan), కార్ లోన్(Car Loan), పర్సనల్ లోన్(Personal Loan) వంటి రుణాలు తీసుకున్నవారిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో (Floating Interest Rate) రుణాలు చెల్లిస్తున్నవారికి ఈఎంఐ భారం పెరగొచ్చు.

పశ్చిమాసియా ఉద్రిక్తతలు(West Asia Tensions), అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు(Crude Oil Prices), ద్రవ్యోల్బణం (Inflation) వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) తెలిపారు. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలపై కూడా ఒత్తిడి పెరగొచ్చని ఆర్‌బీఐ పేర్కొంది.

2026లో ఇది ఆర్‌బీఐ(RBI) నిర్వహించిన నాలుగో ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశం. అంతకుముందు ఏప్రిల్, జూన్, ఆగస్టులో రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించారు. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈసారి 25 బేసిస్ పాయింట్ల పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.

బ్యాంకులు స్వల్పకాలిక అవసరాల కోసం ఆర్‌బీఐ నుంచి తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. ఇది పెరిగితే బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయం పెరిగే అవకాశం ఉండటంతో, ఆ ప్రభావాన్ని రుణాలపై వడ్డీ రేట్ల పెంపు రూపంలో కస్టమర్లకు బదిలీ చేయవచ్చు.

దీంతో హోమ్, కార్, పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు పెరిగితే ఈఎంఐలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రభావం ప్రతి రుణగ్రహీతపై ఒకేలా ఉండదు. ఆయా బ్యాంకుల వడ్డీ రేటు, రుణ కాలవ్యవధి, ఒప్పంద నిబంధనలను బట్టి ఈఎంఐలో మార్పు ఉంటుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment