---Advertisement---

Dharmendra Pradhan: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!

July 25, 2026

Summarize with AI

---Advertisement---

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) వ్యవహారం చివరకు కేంద్ర రాజకీయాల్లో భారీ ప్రకంపనలు రేపింది. పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీక్ వివాదంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తన పదవికి రాజీనామా (Resignation) చేసినట్లు సమాచారం. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారగా, విద్యార్థుల ఆందోళనలకు ఇది పెద్ద విజయంగా భావిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు(Students), యువజన సంఘాలు (Youth Organizations) ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని (New Delhi) జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద భారీ స్థాయిలో నిరసనలు కొనసాగాయి. వేలాది మంది అభ్యర్థులు రోడ్డెక్కి తమ గళం వినిపించడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. చివరికి విద్యార్థుల ఉద్యమం ఫలించి మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఇక మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో కీలక నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు ప్రారంభించింది. ఈ కుంభకోణంలో భాగమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో (Students Future) ముడిపడిన ఈ వ్యవహారంపై కేంద్రం ఇకపై మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment