చైనాలోని (China) హాంగ్‌జౌ (Hangzhou) వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026లో (ISSF World Cup 2026) భారత మహిళా షూటర్లు (Indian Women Shooters) అదిరిపోయే ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో భారత్(India) ఏకంగా 2 పతకాలు (2 Medals) సాధించి సత్తా చాటింది. హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన యువ షూటర్ ఈషా సింగ్ (Esha Singh) స్వర్ణ పతకాన్ని (Gold Medal) కైవసం చేసుకోగా, పారిస్ ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్ (Manu Bhaker) కాంస్య పతకంతో (Bronze Medal) మరోసారి తన క్లాస్‌ను నిరూపించింది.
21 ఏళ్ల ఈషా సింగ్ ఫైనల్లో మొదటి నుంచే పూర్తి ఆధిపత్యం కనబరిచింది. మొత్తం 40 హిట్స్ నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల మ్యూనిక్ వరల్డ్ కప్‌లో (Munich World Cup) ప్రపంచ రికార్డు సృష్టించిన ఈషా, ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుని అద్భుత ఫామ్ కొనసాగిస్తోంది.
మరోవైపు మను భాకర్ కూడా చివరి వరకు గట్టి పోరాటం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన షూట్-ఆఫ్‌లో విజయం సాధించి మొత్తం 28 హిట్స్‌తో 3వ స్థానాన్ని దక్కించుకుని బ్రాంజ్ మెడల్‌ను ఖరారు చేసింది. మరోసారి కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకుని పతకం సాధించి తన అనుభవాన్ని చాటిచెప్పింది.
ఇప్పటికే క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే ఈషా సింగ్, మను భాకర్ వరుసగా టాప్-2 స్థానాల్లో నిలిచి తమ ఫామ్‌ను నిరూపించారు. ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించి భారత్‌కు డబుల్ మెడల్ అందించారు.
విజయం అనంతరం ఈషా సింగ్ మాట్లాడుతూ హాంగ్‌జౌ షూటింగ్ (Hangzhou Shooting) రేంజ్‌లో గతంలో పోటీ పడిన అనుభవం తనకు ఎంతో ఉపయోగపడిందని తెలిపింది. మను భాకర్ కూడా ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో పాటు ఆసియా క్రీడలకు ముందు వచ్చిన ఈ 2 పతకాలు భారత జట్టుకు భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని పేర్కొంది.








