---Advertisement---

డీలిమిటేషన్ పై నాడే ప్రధాన మంత్రికి జగన్ లేఖ!

April 17, 2026

---Advertisement---

దేశ రాజకీయాల్లో ఒక కీలక మలుపు తిప్పే అంశంగా మారుతున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాటి ఆ లేఖలో డీలిమిటేషన్ జరగడాన్ని జగన్ పూర్తిగా అంగీకరిస్తునే దక్షిణాది రాష్ట్రాల్లో నెల్కోన్న ఆందోళన అంశాలను ఆయన లేవనెత్తారు.

జగన్ తన లేఖలో స్పష్టంగా సూచించిన ప్రధాన అంశం ఏమిటంటే—2026 తర్వాత జరిగే డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రాతినిధ్యంలో అసమతుల్యత పెరిగే ప్రమాదం ఉందని. ముఖ్యంగా జనాభా నియంత్రణలో విజయవంతమైన దక్షిణ రాష్ట్రాలు, తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే పరిస్థితి ఎదుర్కొనవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు సీట్ల పునర్విభజనపై ఉన్న నిషేధం ముగియనున్న నేపథ్యంలో, జనాభా ఆధారంగా సీట్ల కేటాయింపు తిరిగి ప్రారంభమవుతుంది.

అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోందని. గత కొన్ని దశాబ్దాలుగా దక్షిణ రాష్ట్రాలు కుటుంబ నియంత్రణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల వారి జనాభా వృద్ధి రేటు తగ్గిందని. మరోవైపు, ఉత్తర రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందని. ఈ పరిస్థితిలో జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగితే, ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉంది. దాంతో దక్షిణ రాష్ట్రాల రాజకీయ ప్రభావం తగ్గిపోతుందనే భయం నెలకొందని జగన్ పెర్కోన్నారు.

జగన్ లేఖలో ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81(2)(ఏ) గురించి ప్రస్తావించారు. ఈ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి కేటాయించే సీట్లు మరియు ఆ రాష్ట్ర జనాభా మధ్య నిష్పత్తి సమానంగా ఉండాలి. ఈ నిబంధన కొనసాగితే, కేంద్ర హోం మంత్రి ఇచ్చిన హామీ ఏ రాష్ట్రానికీ నష్టం జరగదనే మాట అమలు చేయడం కష్టమవుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో ఆయన కీలక సూచన చేశారు. రాజ్యాంగ సవరణ అవసరం. మొత్తం సీట్ల సంఖ్యను పెంచి, ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న వాటా తగ్గకుండా చూసేలా మార్పులు చేయాలని సూచించారు. అంటే, సీట్ల సంఖ్య పెరిగినా, వాటాలో ఎవరూ నష్టపోకూడదన్నది ఆయన ప్రధాన వాదన.

ఈ లేఖలో మరో ముఖ్య అంశం దేశంలో సామాజిక మరియు రాజకీయ సమతుల్యత. ఒక ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే భావన పెరిగితే, అది దేశ సమగ్రతపై ప్రభావం చూపవచ్చని జగన్ అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ముందుగానే చట్టపరమైన మార్పులు చేసి, అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు.

డీలిమిటేషన్ జరగడాన్ని జగన్ పూర్తిగా అంగీకరిస్తునే, ఏ రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండాలనే సూచన చేశారు, అలాగే ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరగకూడదని ఆయన లేఖ ద్వారా స్పష్టం చేశారు. నాటి జగన్ లేఖ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. అభివృద్ధి, జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు శిక్ష పడాలా? లేక సమతుల్య ప్రాతినిధ్యం కోసం కొత్త విధానం తీసుకురావాలా? ఈ ప్రశ్నకు సమాధానం కేవలం రాజకీయ నిర్ణయం కాదు దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక దశగా మారబోతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment