---Advertisement---

గొడ్డలి పార్టీ ఎవరిది..? జగన్ ఒక్క ప్రశ్నతో టీడీపీ వ్యూహం తలకిందులైందా!

May 21, 2026

---Advertisement---

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తనకు ఉన్న మీడియా బలాన్ని ఉపయోగించి ప్రత్యర్థులపై వివిధ రకాల బ్రాండింగ్‌లు చేస్తూ రాజకీయంగా ముందుకు సాగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీతో(BJP) విభేదాల సమయంలో ఆ పార్టీని మతతత్వ పార్టీగా (Communal Party), ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) తీవ్రవాదిగా (Extremist) చిత్రీకరించిన టీడీపీ(TDP), తరువాత అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రం అభివృద్ధి మోడల్ (Development Model) అంటూ ప్రచారం చేసుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రజారాజ్యం పార్టీ ఏర్పడిన సమయంలో టికెట్లు అమ్ముకుంటున్నారని ప్రచారం చేయడం, పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) విమర్శలు చేయడం కూడా అప్పటి రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేస్తూ ఆయనను ప్రశంసించడం టీడీపీ ద్వంద్వ వైఖరికి ఉదాహరణగా పేర్కొంటున్నారు.

వైఎస్సార్ కుటుంబంపై (YSR Family) కూడా ఎన్నో సంవత్సరాలుగా వివిధ రకాల నెగిటివ్ బ్రాండింగ్‌లు జరిగాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని (YS Rajasekhara Reddy) ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను తరువాత కాలంలో ప్రజలు ఆదరించారని గుర్తు చేస్తున్నారు. అలాగే జగన్‌పై “లక్ష కోట్లు” అనే ప్రచారం కూడా ఒక రాజకీయ వ్యూహమని, ఆ ప్రచారం వెనుక కుట్ర ఉందని మాజీ నేతలు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.

ఇప్పుడు తాజాగా వైసీపీపై “గొడ్డలి పార్టీ”(Axe Party) అనే కొత్త బ్రాండింగ్‌ను టీడీపీ ప్రారంభించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వినుకొండ రషీద్(Rasheed), దగ్గర నుండి అనంతపురం పాపిరెడ్డిపల్లి కురుబ లింగమయ్య (Kuruba Lingamayya) వరకు జరిగిన హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసాలు ప్రజల్లో చర్చకు దారి తీస్తుండటంతో, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ప్రచారం మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నిర్వహించిన పత్రికా సమావేశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. “ఎవరిది గొడ్డలి పార్టీ?” అంటూ ఆయన నేరుగా ప్రశ్నించారు. వంగవీటి రంగ హత్య (Vangaveeti Ranga), జర్నలిస్ట్ పింగళి దశరథరాం (Pingali Dasaratharam) హత్య, మలెల్ల బాబ్జీ (Malella Babji) ఘటన, బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పులు, రాజారెడ్డి హత్య వంటి పలు సంఘటనలను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనల వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందని ప్రశ్నిస్తూ టీడీపీనే అసలు “గొడ్డలి పార్టీ” అని మండిపడ్డారు.

జగన్ చేసిన ఈ ఎదురుదాడితో టీడీపీ వేసిన బ్రాండింగ్ తిరిగి వారిపైనే ప్రభావం చూపుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలోలా మౌనంగా ఉండకుండా జగన్ వెంటనే ప్రతిస్పందించడం టీడీపీ నాయకత్వాన్ని అసహనానికి గురి చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాలుగా నెగిటివ్ బ్రాండింగ్ రాజకీయాలను నమ్ముకున్న టీడీపీకి ఇప్పుడు అదే వ్యూహం ప్రతికూలంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment