---Advertisement---

జనసేనలో మరొక కీచక పర్వం…

April 9, 2026

---Advertisement---

జనసేన పార్టీలో (Janasena Party) మరోసారి మహిళా వేదింపుల (Women Harassment) ఆరోపణలు వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు నేతలపై మహిళలను మోసం చేసిన కేసులు బయటపడిన నేపథ్యంలో, తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో (West Godavari district) మరో ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

వీరవాసరం మండలానికి చెందిన జనసేన జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాశ్ నాయుడు (Gunda Jayaprakash Naidu) తనను మోసం చేసి వేధించాడని భీమవరం గునుపూడికి చెందిన మద్దాల విజయలక్ష్మి (Maddala Vijayalakshmi) అనే మహిళ వీడియో ద్వారా ఆరోపించారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం, పార్టీ కార్యకలాపాల ద్వారా పరిచయం ఏర్పడిన అనంతరం ప్రేమ (Love) పేరుతో పెళ్లి చేస్తానని నమ్మబలికినట్లు పేర్కొన్నారు.

తన వ్యక్తిగత పరిస్థితులను తెలుసుకున్నప్పటికీ, తనను నమ్మించి రెండు సంవత్సరాల పాటు సహజీవనం కొనసాగించాడని, ఈ కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సుమారు రూ.10 లక్షలు మరియు బంగారం తీసుకున్నాడని ఆరోపించారు. అనంతరం అతని ప్రవర్తన పూర్తిగా మారి, శారీరకంగా మరియు మానసికంగా వేధింపులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను అనుభవించిన బాధలను వివరించుతూ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీస్తోంది. ఈ ఘటనతో పాటు, గతంలో కూడా అదే నాయకుడిపై భారీ ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులు నమోదైన విషయం ప్రస్తావనకు వచ్చింది.

ఈ వరుస సంఘటనల నేపథ్యంలో జనసేన పార్టీ అంతర్గత వ్యవహారాలు, నాయకత్వ స్పందనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందన ఏమిటి అనే అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment