రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితులు రాజ్యమేలుతున్నాయని వైఎస్సార్సీపీ లీగల్ (YSRCP Legal) వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కనుమరుగై పోలీస్ రాజ్ మాత్రమే కొనసాగుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో పోలీస్ వ్యవస్థ (Police System) నిర్వీర్యమైందని, అక్రమాలు (Illegal Activities) మరియు అవినీతి (Corruption) గురించి ప్రశ్నించిన వారిని జైలుకు (Jail) పంపించే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
ప్రజా సమస్యలను (Public Issues) పూర్తిగా పక్కన పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) గారు నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని, మీడియాను అడ్డుపెట్టుకుని అరాచక పాలన సాగిస్తున్నారని పొన్నవోలు మండిపడ్డారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలు కూడా భయాందోళనల మధ్య జీవించాల్సిన పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు.
ముఖ్యంగా శ్రీకాళహస్తి (Srikalahasti) వంటి పుణ్యక్షేత్రంలో విదేశాల నుండి వచ్చిన ఓ భక్తురాలు దర్శనానికి వెళ్లిన సమయంలో ఎదుర్కొన్న అసౌకర్యాలు, అక్కడ జరుగుతున్న లంచగొండితనం గురించి సోషల్ మీడియాలో వీడియో రూపంలో తన అనుభవాన్ని వెల్లడించిందని తెలిపారు. ఆ భక్తురాలి మాటలను పరిగణలోకి తీసుకుని ఆలయంలో జరుగుతున్న అవినీతి, భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాల్సింది పోయి, ఆమెపైనే కేసు నమోదు చేయడం రాష్ట్రంలో మాట్లాడే హక్కు కూడా లేకుండా చేస్తున్న సంకేతమని పొన్నవోలు ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై సెన్సార్ విధించడం, కేసులు నమోదు చేయడం, సామాన్య ప్రజలను కూడా భయభ్రాంతులకు గురిచేసి అరెస్టుల వరకు వెళ్లడం ద్వారా ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలను స్వీకరించాల్సిన ప్రభుత్వం, ప్రజల అభిప్రాయాలను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.






