---Advertisement---

బొత్స, ధర్మాన పేర్లు ఎత్తి – ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సెల్ఫ్ గోల్ వేసుకున్నారా?

April 13, 2026

Summarize with AI

---Advertisement---

వైసీపీ నాయకుల మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయని, రాజకీయ స్వార్థంతో వారు ఎప్పటికప్పుడు మాటలు మార్చుతుంటారని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారని, ఇప్పుడు అదే నేతలు జగన్ పక్షాన మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

అయితే, ఎంపీ కలిశెట్టి తన పార్టీ అధినేత గతాన్ని మరిచి ‘సెల్ఫ్ గోల్’ వేసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. లోతుగా పరిశీలిస్తే, జగన్ తన నాయకత్వాన్ని నిరూపించుకున్న ఘటనను విమర్శగా చూపే ప్రయత్నంలో ఆయన అబాసుపాలయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

నాటి ఘటనలను గుర్తు చేస్తూ—వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ ‘ఓదార్పు యాత్ర’ చేపట్టినప్పుడు, కాంగ్రెస్ పార్టీ దీనిని వ్యతిరేకించింది. ఆ పార్టీతో ఇమడలేమని భావించిన జగన్, స్వంత మార్గం ఎంచుకున్నారు. ఆ సమయంలో పలువురు కాంగ్రెస్ నాయకులు జగన్‌ను ‘అనుభవం లేని యువకుడు’, ‘తడబడే నిర్ణయాలు తీసుకుంటున్నాడు’ అని విమర్శించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిలబడితే నష్టపోతాడని భావించి, వారు పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు జగన్‌పై విమర్శలు చేశారు.

కానీ తరువాత పరిస్థితులు మారాయి. జగన్ పట్టుదల, నిబద్ధత, ధైర్యం చూసి, మరోవైపు కాంగ్రెస్ పార్టీ పతనం, రాజకీయ పరిణామాలు, అలాగే టీడీపీ పార్టీతో జరిగిన రహస్య ఒప్పందాలు వంటి అంశాలను గమనించి, పలువురు నేతలు ఆ పార్టీలో ఇమడలేక జగన్ వెంట నడిచారు. ఇందులో తప్పేమీ లేదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, జగన్ తనను విమర్శించిన వారినే తిరిగి తనవైపు తిప్పుకోవడం ద్వారా తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారని కూడా అంటున్నారు.

అయితే మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుని, తరువాత మళ్లీ పొత్తులు పెట్టుకుని కలిసి నడవడం నైతికతకే విరుద్ధమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో—తనను విమర్శించిన వారినే తనవైపు తిప్పుకుని నాయకత్వాన్ని నిరూపించుకున్న జగన్ దారి సరైనదా? లేకపోతే ఒకప్పుడు తీవ్రంగా విమర్శించుకుని, తరువాత మళ్లీ కలిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరు సరైనదా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.

ఇక ఎన్టీఆర్ చివరి రోజుల్లో చంద్రబాబు నాయుడితో విభేదాలు ఉన్నప్పటికీ, ఆయనను ఇప్పటికీ తమ నాయకుడిగా భావించే టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. అలాంటి వారు జగన్‌పై నైతికత గురించి ప్రశ్నించగలరా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అలాగే, గతంలో లోకేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఆయనను ప్రశంసించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, జనసేన కార్యకర్తలు జగన్‌ను విమర్శించే స్థాయి ఉందా అనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment