---Advertisement---

కాపులను విస్మరిస్తే జనసేనకు పునాదులే కూలిపోతాయి?.. పవన్‌కు కేఆర్‌పీఎస్ ఘాటు హెచ్చరిక!

May 19, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కాపు సామాజిక (Kapu Community) వర్గం పాత్రపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల పార్టీ సమావేశంలో “తాను ఒక కులం కోసమో, ఒక ప్రాంతం కోసమో పనిచేయనని” చేసిన వ్యాఖ్యలపై కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్‌పీఎస్‌) (Kapu Reservation Porata Samiti – KRPS) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేఆర్‌పీఎస్ రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాదరావు (Chanamalla Prasada Rao) పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాస్తూ, కాపు సమాజానికి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయంపై ఎందుకు గట్టిగా మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

కాపు, బలిజ, తెలగ, ఒంటరి వర్గాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్‌పై ఉందని కేఆర్‌పీఎస్ నేతలు గుర్తు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) కాపు రిజర్వేషన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదని, అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ సమయంలో గట్టిగా స్పందించలేదని విమర్శించారు.

ఇక మెగా కుటుంబానికి కాపు సమాజం చేసిన మద్దతును గుర్తు చేస్తూ కేఆర్‌పీఎస్ కీలక వ్యాఖ్యలు చేసింది. చిరంజీవి (Chiranjeevi) సినిమాల నుంచి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ప్రజారాజ్యం పార్టీ, తరువాత జనసేన వరకు మెగా కుటుంబానికి 80 శాతం కాపులే అండగా నిలిచారని పేర్కొన్నారు. “కాపులు మీ కుటుంబాన్ని ఓన్ చేసుకున్నారు.. మరి మీ కుటుంబం కాపులను ఓన్ చేసుకుందా?” అంటూ ప్రశ్నించారు.

2014లో జనసేన మద్దతుతో టీడీపీ(TDP) అధికారంలోకి వచ్చిందని, కాపు రిజర్వేషన్ అంశంపై హామీ ఇచ్చినా అమలు కాలేదని గుర్తు చేశారు. 2016 నుండి 2019 వరకు జరిగిన కాపు ఉద్యమ సమయంలో పవన్ స్పందించకపోవడమే 2019 ఎన్నికల్లో ఆయన ఓటమికి కారణమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం మరోసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తోందని, ఇదే పరిస్థితి కొనసాగితే 2029లో రాజకీయ ఫలితాలు పూర్తిగా మారిపోతాయని కేఆర్‌పీఎస్ హెచ్చరించింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment