---Advertisement---

పవన్ కళ్యాణ్ తాను చేసిన వ్యాఖ్యలను నిరూపించాలి: కేవీపీ డిమాండ్

June 4, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణ (Telangana) ఆవిర్భావ దినోత్సవం (Formation Day) సందర్భంగా హైదరాబాద్‌లో (Hyderabad) నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి (Dr. YS Rajasekhara Reddy) తనను లక్ష్యంగా చేసుకున్నారని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు (Dr. KVP Ramachandra Rao) పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాస్తూ తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ పేరు ప్రస్తావన వచ్చినప్పుడు వైఎస్సార్ గుర్తుకు రావడం సహజమేనని పేర్కొన్న ఆయన, వైఎస్సార్‌పై పవన్ చేసిన ఆరోపణలు ఆధారరహితమైనవని ఖండించారు.

తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ ఒక ఉన్నత పోలీసు అధికారి ద్వారా వైఎస్సార్ తనపై కుట్ర పన్నారని తెలుసుకున్నానని చెప్పడాన్ని కేవీపీ ప్రశ్నించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్‌పై రాజకీయ కేసులు పెట్టిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఆ స్థాయి నాయకులు తమ రాజకీయ ప్రణాళికలను పోలీసు అధికారులతో చర్చించడం సాధారణం కాదని వ్యాఖ్యానించారు.

ఈ వివాదానికి తెరదించేందుకు కేవీపీ ఒక సంచలన సవాల్ విసిరారు. పవన్ పేర్కొన్న ఆ ఉన్నత పోలీసు అధికారి లై డిటెక్టర్ పరీక్ష ముందు వైఎస్సార్ నిజంగానే అలాంటి వ్యాఖ్యలు చేశారని నిర్ధారిస్తే, తాను మరియు వైఎస్సార్ అభిమానులు కలిసి రూ.10 కోట్లు తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి సహాయ నిధికి (Chief Minister Relief Fund) లేదా పవన్ సూచించిన స్వచ్ఛంద సంస్థకు అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. అదే సమయంలో పవన్ కూడా తన ఆరోపణలకు కట్టుబడి ఈ సవాల్‌ను స్వీకరించాలని కోరారు.

అప్పటి రాజకీయ పరిస్థితులను ప్రస్తావించిన కేవీపీ, 2005-06 కాలంలో కాంగ్రెస్ పార్టీకి (Congress Government) మరియు వైఎస్సార్‌కు(YSR) ఉన్న ప్రజాదరణ దృష్ట్యా పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుపై ఆలోచించాల్సిన అవసరం వారికి లేదని పేర్కొన్నారు. ఆ సమయంలో పవన్ లేదా ఆయన కుటుంబ సభ్యులు రాజకీయాల్లో లేకపోవడంతో ఆయనను లక్ష్యంగా చేసుకుని కుట్రలు జరిగాయనే వాదనలో తార్కికత లేదని అన్నారు.

అలాగే, యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పవన్ కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన నాయకుడి ప్రతిష్ఠను దెబ్బతీయాలని ప్రయత్నించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో సభకు అనుమతి నిరాకరణ అంశాన్ని వైఎస్సార్ లేదా కాంగ్రెస్‌తో అనుసంధానించడం వల్ల ప్రయోజనం లేదని పేర్కొన్న కేవీపీ, రాజకీయ విభేదాలు ఉంటే వాటిని ప్రత్యక్షంగా ఎదుర్కోవాలని సూచించారు కేవీపీ రామచంద్రరావు విసిరిన ఈ బహిరంగ సవాల్‌కు పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? లేక ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా? చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment