---Advertisement---

Manmohan Singh:కోల్ స్కామ్ కేసులో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్..!

July 29, 2026

Summarize with AI

---Advertisement---

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు (Manmohan Singh) కోల్ స్కామ్ కేసులో (Coal Scam Case) సుప్రీంకోర్టు(Supreme Court) నుంచి భారీ ఊరట లభించింది. యూపీఏ ప్రభుత్వ (UPA Government) హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు బ్లాకుల కేటాయింపుల కేసులో (Coal Blocks Allocation) ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును (Criminal Case) సుప్రీంకోర్టు పూర్తిగా ముగించింది. గతంలో ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను కూడా అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ క్లోజర్ రిపోర్ట్ (CBI Report) దాఖలు చేసి మన్మోహన్ సింగ్‌కు క్లీన్ చిట్ (Clean Chit) ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జైమాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం సీబీఐ నివేదికను ఆమోదించింది. 2024 డిసెంబర్‌లో మరణించిన మన్మోహన్ సింగ్‌కు ఈ తీర్పుతో అధికారికంగా నిర్దోషి హోదా లభించింది.

సీబీఐ సమర్పించిన క్లోజర్ రిపోర్ట్‌ను తిరస్కరించడానికి లేదా ఆయనపై క్రిమినల్ అభియోగాలను కొనసాగించడానికి ఎలాంటి బలమైన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ సంస్థ సమర్పించిన నివేదికలను పరిశీలించిన తర్వాత వాటిని పక్కనబెట్టి కేసును కొనసాగించే పరిస్థితి కనిపించడం లేదని ధర్మాసనం పేర్కొంది. దీంతో 2015 మార్చి 11న ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో పాటు మన్మోహన్ సింగ్‌కు జారీ చేసిన సమన్లను కూడా రద్దు చేస్తూ కేసును ముగిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ కేసు 2005లో ఒడిశాలోని తలబిరా-2 బొగ్గు బ్లాకు కేటాయింపులకు సంబంధించినది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా(Kumar Mangalam Birla), మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి పి.సి. పరాఖ్ (P.C. Parakh) సహా మొత్తం 6 మందిని ప్రత్యేక కోర్టు నిందితులుగా పేర్కొంటూ సమన్లు జారీ చేసింది. అనంతరం మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ సమన్ల అమలుపై స్టే విధించబడింది.

ప్రధానిగా తీసుకున్న నిర్ణయాలపై తనను ప్రాసిక్యూట్ చేయడానికి అవసరమైన చట్టబద్ధమైన అనుమతి లేదని, అలాగే బొగ్గు బ్లాకుల కేటాయింపులో ఎలాంటి క్రిమినల్ కుట్ర లేదా దురుద్దేశం లేదని మన్మోహన్ సింగ్ తరఫున వాదనలు వినిపించబడ్డాయి. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం సీబీఐ సమర్పించిన క్లోజర్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టు ఆమోదించడంతో కోల్ స్కామ్ కేసులో మన్మోహన్ సింగ్‌పై ఉన్న అన్ని న్యాయపరమైన చర్యలకు పూర్తిగా ముగింపు పడింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment