---Advertisement---

కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత.

July 14, 2026

Summarize with AI

---Advertisement---

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని సిందూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈ రోజు తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన చివరి వరకు ధైర్యంగా పోరాడినా, చివరకు వ్యాధికి తలొగ్గారు.

ముద్రగడ పద్మనాభం పేరు చెప్పగానే ఉద్యమస్ఫూర్తి, మొండితనం, ధైర్యం, తెగువ, ఆత్మగౌరవం గుర్తుకు వస్తాయి. ప్రజా సమస్యలపై రాజీపడని నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 1988లో ఉత్తరకంచి ఘటన, 1994లో కాపులకు రిజర్వేషన్ల కోసం చేపట్టిన నిరాహార దీక్ష, 2016లో కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో తునిలో ప్రారంభమైన కాపు ఐక్యగర్జన సభ వంటి ఉద్యమాలు ఆయన పోరాట పటిమకు నిదర్శనాలుగా నిలిచాయి.

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, ఎన్నికల్లో ఓడిపోతే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడి నిజంగానే పేరు మార్చుకోవడం ఆయన వ్యక్తిత్వంలోని మొండి నిబద్ధతకు ఉదాహరణగా నిలిచింది.

కాపు సామాజిక వర్గ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నాయకుల్లో వంగవీటి మోహనరంగా తర్వాత అదే స్థాయిలో ప్రజాదరణ, ఉద్యమ నాయకత్వం సంపాదించిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభాన్ని పలువురు భావిస్తారు. ఆయన మరణంతో కాపు ఉద్యమ చరిత్రలో ఒక శకం ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment