---Advertisement---

విశాఖలో మత్స్యకార కుటుంబాలకు జగన్ పరామర్శ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

July 14, 2026

Summarize with AI

---Advertisement---

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖలో బోటు ప్రమాద బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. ఆయన రాకతో నగరంలో భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.

జబ్బర్‌తోటలో బాధిత కుటుంబాలను కలిసిన జగన్.. బోటు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి ఉంటే ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదని ఆరోపించారు. ఘటనపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తూ, బాధిత కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకార కుటుంబాలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చిన జగన్.. గతంలో మత్స్యకారుల సంక్షేమం కోసం ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం వాటిని స్కామ్‌లతో అమ్మేస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ తరఫున ఒక్కో బాధిత కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని పార్టీ నేత కేకే రాజు ప్రకటించారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ కారి చిన్నా కుటుంబానికి కూడా రూ.7 లక్షల సాయం అందిస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment