---Advertisement---

ముద్రగడ పద్మనాభం గారి మరణం తీరని లోటు – వైయస్ జగన్‌

July 14, 2026

Summarize with AI

---Advertisement---

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ గారి కుమారుడు గిరిబాబుకు ఫోన్ చేసి వ్యక్తిగతంగా పరామర్శించారు.

ముద్రగడ పద్మనాభం గారి హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైయస్ జగన్ పేర్కొన్నారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని వైయస్ జగన్ సూచించారు. ప్రజల కోసం ముద్రగడ పద్మనాభం గారు చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ప్రజా జీవితంలో చేసిన కృషిని ఎప్పటికీ మరువలేమని నివాళులర్పించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment