---Advertisement---

ముంబైలో విషాదం.. స్కూల్ వ్యాన్‌పై కూలిన భారీ చెట్టు.. 11 ఏళ్ల విద్యార్థి మృతి!

June 30, 2026

Summarize with AI

---Advertisement---

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains) మరో విషాదానికి కారణమయ్యాయి. చెంబూర్ (Chembur) ప్రాంతంలో విద్యార్థులతో (Students) వెళ్తున్న స్కూల్ వ్యాన్‌పై (School Van) భారీ రావి చెట్టు (Peepal Tree) ఒక్కసారిగా కూలిపోవడంతో 11 ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటనలో మరికొందరు విద్యార్థులు గాయపడగా, వారిని వెంటనే రక్షించి సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మంగళవారం మధ్యాహ్నం చెంబూర్‌లోని రోడ్ నెం.11 సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. యూనివర్సల్ హై స్కూల్‌కు (Universal High School) చెందిన వ్యాన్‌లో మొత్తం 12 మంది విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్తుండగా భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల ప్రభావంతో రోడ్డుపక్కన ఉన్న భారీ రావి చెట్టు వేరుతో సహా ఒక్కసారిగా కూలి నేరుగా వ్యాన్‌పై పడింది. చెట్టు బరువుకు వ్యాన్ పూర్తిగా దెబ్బతినడంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, మున్సిపల్ అధికారులు, సహాయక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. వ్యాన్‌లో ఉన్న 12 మంది విద్యార్థులను(Students) ఒక్కొక్కరిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే ఒక 11 ఏళ్ల విద్యార్థి వ్యాన్‌లో ఇరుక్కుపోవడంతో అతడిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాయి. చివరకు అతడిని బయటకు తీసే సమయానికి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ముంబై ఎం-వెస్ట్ వార్డు అసిస్టెంట్ కమిషనర్ (Assistant Commissioner) తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాద సమాచారం అందిన వెంటనే ముంబై ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అత్యవసర వైద్య బృందాలు వేగంగా స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన విద్యార్థులను సమీప ఆస్పత్రులకు తరలించి అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనతో చెంబూర్ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. భారీ వర్షాల సమయంలో పాత చెట్లు, బలహీనమైన కొమ్మల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యాసంస్థలు, స్కూల్ వాహనాల నిర్వాహకులు, తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలంలో అనవసర ప్రయాణాలు తగ్గించడం, ప్రమాదకర ప్రాంతాల వద్ద జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇలాంటి దుర్ఘటనలను నివారించవచ్చని అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment