---Advertisement---

నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

April 22, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ చరిత్రలో ఎన్నో మలుపులు ఉన్నప్పటికీ, నాదెండ్ల భాస్కరరావు (Nadendla Bhaskara Rao) పేరు వినగానే గుర్తుకు వచ్చే ఘట్టం ఒకటే 1984లో జరిగిన అధికార మార్పిడి. గుంటూరు జిల్లాలో 1935 జూన్ 23న జన్మించిన భాస్కరరావు, సాధారణ కుటుంబంలో పుట్టినా అసాధారణ రాజకీయ ప్రయాణాన్ని సాగించారు. కొల్లూరు హైస్కూల్‌లో (Kolluru High School) విద్యాభ్యాసం పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించిన ఆయన, న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టారు.

కాంగ్రెస్ పార్టీలో (Congress Party) తన రాజకీయ జీవితం ప్రారంభించిన భాస్కరరావు, 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై చెన్నారెడ్డి మంత్రివర్గంలో సేవలందించారు. కానీ ఆయన రాజకీయ జీవితానికి అసలు మలుపు నందమూరి తారక రామారావుతో (Nandamuri Taraka Rama Rao) కలిసి తెలుగుదేశం పార్టీ(TDP) స్థాపనలో కీలక పాత్ర పోషించడం ద్వారా వచ్చింది. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అయితే, 1984లో జరిగిన సంఘటనలు ఆయన రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఎన్టీఆర్ అమెరికాలో చికిత్స పొందుతున్న సమయంలో, ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి, తానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో భారీ దుమారం రేపింది. ప్రజలు దీనిని అంగీకరించకపోవడంతో, ఎన్టీఆర్ ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ ఉద్యమాన్ని ప్రారంభించారు. తీవ్ర ప్రజా వ్యతిరేకత మధ్య భాస్కరరావు కేవలం 31 రోజులకే ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు.

ఈ 31 రోజుల పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలల్లో కోన్ని వివాదాస్పదమూ అయ్యాయి. ముఖ్యంగా ప్రముఖ రాజకీయ నాయకుడు కుటుంభసభ్యులకి మేలు చేయడానికి ఆయన 10వ తరగతిలో ఫేయిల్ అయిన విధ్యార్ధులు పాస్ అయ్యే విదంగా 3 గ్రెస్ మార్కులు కలిపేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రేస్ మార్కుల పెంపు వలనే నాడు నేటి డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా 10వ తరగతి పాస్ అయ్యరు.

ఈ సంఘటన ఆయన రాజకీయ జీవితంపై చెరగని ముద్ర వేసింది. టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినా, పూర్వపు ప్రభావాన్ని తిరిగి సాధించలేకపోయారు. తరువాత ఖమ్మం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై జాతీయ రాజకీయాల్లో కూడా తన ముద్ర వేశారు. 2019లో కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరడం ఆయన రాజకీయ ప్రయాణంలో మరో కీలక ఘట్టంగా నిలిచింది.

భాస్కరరావు తన జీవిత అనుభవాలను “నా జీవిత ప్రస్థానం” అనే ఆత్మకథలో వివరించారు. అందులో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుతో తన విభేదాలను స్పష్టంగా ప్రస్తావించారు. ముఖ్యంగా 1995లో జరిగిన రాజకీయ పరిణామాలపై చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శిస్తూ, తన 1984 చర్య కంటే అది పెద్ద వెన్నుపోటు అని అభిప్రాయపడ్డారు.

తాజాగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన మరణించడం తెలుగు రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసినట్లైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పౌర సరఫరాలు, ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ నాదెండ్ల భాస్కరరావు కుమారుడు. నాదెండ్ల భాస్కరరావు ఒక శక్తివంతమైన నాయకుడు, కానీ ఒకే నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తును శాశ్వతంగా మార్చింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment