---Advertisement---

ఎమ్మెల్యే పేరు చెప్పి టీడీపీ మహిళా నేత బెదిరింపు ? నరసరావుపేటలో ‘హనీ ట్రాప్’ తరహా ఘటన?

May 12, 2026

Summarize with AI

---Advertisement---

నరసరావుపేట (Narasaraopet) టీడీపీ (TDP) నేతల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఓ టీడీపీ మహిళ (TDP Woman Leader) బాగోతం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. పట్టణానికి చెందిన కర్లకుంట కృష్ణదీప్తి తాజాగా జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఆశ్రయించి సదరు టీడీపీ మహిళా నేతపై సంచలన ఆరోపణలు చేసింది. టీడీపీకి చెందిన మల్లవరపు అభినయ సింధూర (Mallavarapu Abhinaya Sindhura) తన కుటుంబ జీవితంలో జోక్యం చేసుకుని కాపురాన్ని ఛిద్రము చేసిందని కృష్ణదీప్తి ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలు కృష్ణదీప్తి వాదన ప్రకారం, తాను తన భర్త కాళీతో ముగ్గురు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో, సుమారు పది నెలల క్రితం టీడీపీ మహిళ అభినయ సింధూర తన భర్తకు పరిచయమైందని తెలిపింది. అప్పటి నుంచి అతడు కుటుంబానికి దూరమయ్యాడని, ఇంటికి రావడం కూడా తగ్గించాడని ఆరోపించింది. ఈ విషయంలో నిలదీస్తే సదరు టీడీపీ మహిళ “నేను ఎమ్మెల్యే గారి అమ్మాయిని.. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) మా మావయ్య” అంటూ బెదిరింపులకు దిగుతోందని కృష్ణదీప్తి పేర్కొంది.

అంతేకాకుండా తన భర్తకు విడాకులు ఇవ్వాలని మల్లవరపు అభినయ సింధూర ఒత్తిడి తెస్తోందని, వినకపోతే రాజకీయ పలుకుబడితో అక్రమ కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తోందని ఆమె వాపోయింది. పరిస్థితి విషమించడంతో టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సీఐ ప్రభాకర్ (CI Prabhakar) కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపింది. అనంతరం తన భర్త తిరిగి కుటుంబం వైపు రావడానికి ప్రయత్నించగా, అతనిపై రేప్ కేసు పెడతానంటూ సింధూర బెదిరింపులకు దిగిందని ఆరోపించింది.

“నీ భార్యను వదిలి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటాను.. లేదంటే మీ కుటుంబాన్ని నాశనం చేస్తాను” అంటూ తమపై మానసిక ఒత్తిడి తీసుకొస్తోందని బాధిత కుటుంబం చెబుతోంది. ఇప్పటికే అప్పులపాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు ప్రాణహాని భయం వెంటాడుతోందని కృష్ణదీప్తి తన ఫిర్యాదులో పేర్కొంది. న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని కూడా ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదిలా ఉండగా, మల్లవరపు అభినయ సింధూర పేరు గతంలో కూడా వివాదాల్లో నిలిచింది. టీడీపీ ఆద్వర్యంలో సాగిన అమరావతి ఉద్యమ సమయంలో గుడివాడలో కారుపైకి ఎక్కి వైసీపీ నేత కొడాలి నానిపై (Kodali Nani) అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో వైసీపీ (YSRCP) నేతలపై నిత్యం తీవ్ర విమర్శలు, దూషణలు చేయడం ద్వారా కూడా తరచూ చర్చకు వచ్చింది.

మరోవైపు, గతంలో ముప్పాళ్లలో ఎస్సైగా పనిచేసిన జగదీష్‌పై (Jagadeesh) కూడా ఆమె సంచలన ఆరోపణలు చేసింది. తాను భర్తతో విభేదాల్లో ఉన్న సమయంలో పరిచయమైన జగదీష్ “విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకుంటాను” అంటూ మోసం చేశాడని, తనతో శారీరక సంబంధం పెట్టుకుని ఓ బిడ్డకు తండ్రయ్యాడని ఫిర్యాదులో పేర్కొంది. 2017లో రహస్యంగా వివాహం చేసుకున్నాడని కూడా ఆరోపించింది.

అయితే ఈ ఆరోపణల సమయంలోనే అభినయ సింధూర మొదటి భర్త సుబ్బారావు (Subbarao) మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశాడు. తన భార్యకు ఎస్సై జగదీష్‌తో ఎలాంటి సంబంధం లేదని, డబ్బుల కోసం పలువురు వ్యక్తులను బెదిరించి వసూళ్లు చేయడం ఆమెకు అలవాటేనని ఆరోపించాడు. అప్పట్లోనే ఈ వ్యవహారం స్థానికంగా అభినయ సింధూర సాగిస్తున్న హనీట్రాప్ గా పెద్ద చర్చకు దారితీసింది.

తర్వాత రాజకీయ కార్యకర్తగా మారిన అభినయ సింధూర, తాను ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వ్యక్తినని చెప్పుకుంటూ అమాయకులను మోసం చేసి డబ్బులు దండుకుంటోందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణదీప్తి చేసిన తాజా ఫిర్యాదుతో మరోసారి “హనీ ట్రాప్”(Honey Trap) ఆరోపణలు రాజకీయంగా వేడెక్కిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment