---Advertisement---

ఎన్టీఆర్‌కు భారత రత్న.. ప్రతి ఏడాది తీర్మానమేనా? చంద్రబాబు వైఖరిపై అభిమానుల్లో పెరుగుతున్న అనుమానాలు

May 28, 2026

Summarize with AI

---Advertisement---

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మహానాడు (Mahanadu) వేదికగా మరోసారి ఎన్టీఆర్‌కు (NTR) భారతరత్న (Bharat Ratna) ఇవ్వాలని తీర్మానం చేయడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి (Birth Anniversary), వర్ధంతి (Death Anniversary) సందర్భాల్లో భారతరత్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ వస్తున్నప్పటికీ, ఆ తర్వాత దానిపై ఎలాంటి కార్యాచరణ కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్టీఆర్‌కు గౌరవం ఇస్తున్నామనే సంకేతంగా మాత్రమే ఈ డిమాండ్‌ను ఉపయోగిస్తున్నారే తప్ప, నిజంగా సాధించాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదని కొందరు అభిమానులే అభిప్రాయపడుతున్నారు. “ప్రతి ఏడాది తీర్మానం.. తర్వాత మౌనం” అనే వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.

2014 తర్వాత కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం (NDA Government) పలువురు ప్రముఖులకు భారత రత్న ప్రకటించింది. 2014లో సి.ఎన్.ఆర్. రావు, సచిన్ టెండూల్కర్, 2015లో అటల్ బిహారి వాజపేయి, మదన్ మోహన్ మాలవ్య, 2019లో ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్, 2024లో ఎల్.కే. అద్వానీ, కర్పూరి ఠాకూర్, పి.వి. నరసింహారావు, చరణ్ సింగ్, ఎం.ఎస్. స్వామినాథన్‌లకు భారతరత్న లభించింది.

ఈ నేపథ్యంలో 2014 తర్వాత దాదాపు ఆరు సంవత్సరాలకు పైగా ఎన్‌డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగిన టీడీపీ(TDP), ఎన్టీఆర్‌కు భారతరత్న సాధించడంలో ఎందుకు విఫలమైందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలకు కూడా భారత రత్న ప్రకటించిన సందర్భాలు ఉన్నప్పుడు, ఎన్టీఆర్ విషయంలో మాత్రం పురోగతి ఎందుకు కనిపించలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఎన్టీఆర్ పేరు చెప్పుకుని రాజకీయ లాభాలు పొందుతున్నారే తప్ప, ఆయనకు అత్యున్నత గౌరవం తీసుకురావడంలో నిజమైన పట్టుదల కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు మహానాడు వేదికగా మరోసారి వచ్చిన ఈ తీర్మానం కూడా మళ్లీ గతంలాగే ప్రకటనలకే పరిమితం అవుతుందా? అన్నదే ఆసక్తికర చర్చగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment