---Advertisement---

కుల సర్టిఫికేట్ వివాదానికి తెర – సుప్రీంలో పుష్పశ్రీవాణిదే విజయం!

February 13, 2026

Summarize with AI

---Advertisement---

మాజీ డిప్యూటీ సీఎం, పాముల పుష్పశ్రీవాణి (Pamula Pushpa Sreevani) గారి ఎస్టీ కుల వివాదానికి (Caste Dispute) సంబంధించి సాగిన న్యాయపోరాటానికి అత్యున్నత న్యాయస్థానంలో తుది ముగింపు లభించింది. గతంలో ఆమె ఎస్టీ కులానికి చెందిన వారు కాదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

2019 ఎన్నికల సందర్భంగా నిమ్మక జయరాజు, నిమ్మక సింహాచలం అనే ఇద్దరు వ్యక్తులు ఆమె కుల ప్రమాణాలపై సందేహాలు వ్యక్తం చేస్తూ హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు సమగ్రంగా పరిశీలించిన హైకోర్టు, పిటిషనర్లు సమర్పించిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని నిర్ధారించింది. డీఎల్‌ఎస్సీ కమిటీ నివేదికతో పాటు స్టేట్ స్క్రూటినీ కమిటీ జారీ చేసిన జీఓ నంబర్ 6ను పరిగణనలోకి తీసుకుని, పుష్పశ్రీవాణి గారు ఎస్టీ కులానికి చెందినవారేనని కోర్టు అభిప్రాయపడింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రతివాదులు సుప్రీం కోర్టు (Supreme Court of India)లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. సుప్రీం కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఈ వివాదానికి పూర్తిస్థాయి ముగింపు పలికినట్లైంది.

దీంతో దాదాపు పదేళ్లుగా కొనసాగిన ఈ వివాదంలో న్యాయమే గెలిచిందని ఆమె అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎస్టీ కాదంటూ సాగిన తప్పుడు ప్రచారానికి న్యాయస్థానాలు స్పష్టమైన సమాధానం ఇచ్చాయని పుష్పశ్రీవాణి గారు ఆనందం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు, న్యాయపరమైన స్పష్టతకు మరియు వ్యవస్థలపై నమ్మకానికి నిదర్శనంగా నిలిచిందని ఆమే సంతోషం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment