---Advertisement---

పంచాయతీ రాజ్‌ శాఖలో పేరుకుపోయిన పెండింగ్‌ బిల్లులు – నిరసనకు పిలుపునిచ్చిన వైఎస్సార్‌సీపీ

April 26, 2026

Summarize with AI

---Advertisement---

రాష్ట్రంలో పంచాయతీ రాజ్‌ శాఖలో (Panchayati Raj Department) పెండింగ్‌లో ఉన్న బిల్లుల (Bills) సమస్య తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల (District Collectors) వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ(YSRCP) పంచాయతీ రాజ్‌ విభాగం ప్రకటించింది. నిరసన అనంతరం కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి (Vennapoosa Ravindra Reddy) వెల్లడించారు.

గతేడాది డిసెంబర్‌ నుంచి నిర్వహించిన పనులకు సంబంధించి కూలీలకు వేతనాలు అందకపోవడం పరిస్థితిని మరింత విషమంగా మార్చింది. ఉపాధి హామీ పథకం (Employment Guarantee Scheme) కూలీలకు గత నాలుగున్నర నెలలుగా సుమారు రూ.1,027 కోట్ల వేతనాలు చెల్లించకపోవడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. అంతేకాక, రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఉన్న 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు రూ.650 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

చట్టం ప్రకారం 14 రోజుల్లో చెల్లించాల్సిన వేతనాలు నెలల తరబడి ఆలస్యం కావడంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, కనీస వసతులు లేకుండా పనిచేస్తున్న కూలీలు వడదెబ్బలకు గురవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న ఈ శాఖపై నిర్లక్ష్య వైఖరి వలన ఇప్పటీకే ఇద్దరు కూలీలు మరణించడం భాదకరం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment