దేశవ్యాప్తంగా పెట్రోల్ (Petrol) ధరలు మళ్లీ ప్రజలపై భారంగా మారుతున్నాయి. కేవలం 10 రోజుల్లోనే లీటర్‌కు రూ.8 వరకు పెరగడం సామాన్యులను (Common People) తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా (Corona) సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వరుసగా ధరలు పెంచి పెట్రోల్‌ను రూ.100 దాటించిన సందర్భాన్ని ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.
ఆ సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి (State Government) ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మరియు జనసేన (Jana Sena Party) నాయకులు జగన్ ప్రభుత్వాన్నే (Jagan Government) లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు, హంగామాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించే ప్రయత్నం చేశారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీలు కూడా ఇచ్చారు.
అయితే ప్రస్తుతం పరిస్థితి మారినా, ధరల భారం మాత్రం తగ్గలేదు. కేవలం పది రోజుల్లోనే పెట్రోల్ ధరలు భారీగా పెరగడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో(NDA Alliance) తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party), జనసేన (Jana Sena Party) కూడా భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో ఈ ధరల పెంపుపై వారి బాధ్యత ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల ముందు చేసిన హామీలు, అప్పటి విమర్శలు ఇప్పుడు ప్రజల ముందే ప్రశ్నార్థకంగా మారాయి. గతంలో పెరిగిన ధరలకు జగన్‌ను బాధ్యుడిగా చూపించిన నాయకులు, ఇప్పుడు అదే పరిస్థితిపై ఏమి చెబుతారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.






