---Advertisement---

నా ప్రశ్నించే గొంతును ఎవరూ ఆపలేరు : ప్రకాష్ రాజ్

July 12, 2026

Summarize with AI

---Advertisement---

తన ప్రశ్నించే గొంతును ఎవరూ ఆపలేరని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) స్పష్టం చేశారు. తాను మౌనంగా లేనని, జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనిస్తున్నానని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రభావంతో పాటు కొందరు జనసైనికులు (JanaSena Workers), మరికొందరు అమ్ముడుపోయిన యూట్యూబర్లు (YouTubers) చేస్తున్న అసత్య ప్రచారాలను తాను వింటున్నానని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో తన సమాధానం ఒక్కటేనని చెబుతూ.. “దిగజారండి.. ఇంకా దిగజారండి” అంటూ తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. ప్రపంచం మొత్తం చూస్తోందని, దిగజారడంలో మీకు మీరే సాటి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

ఇంకా గట్టిగా అరుస్తూ దిగజారండని వ్యాఖ్యానించిన ప్రకాష్ రాజ్.. మీరు ఎంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా తనలాంటి ప్రశ్నించే గొంతులను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. నిజాన్ని ప్రశ్నించే స్వరాలు ఎప్పటికీ కొనసాగుతాయని అన్నారు.

గత కొన్ని రోజులుగా ప్రకాష్ రాజ్ (Prakash Raj) వార్తల్లో నిలుస్తున్నారు. ప్రశ్న రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆయనకు బహిరంగంగా మద్దతు తెలుపుతూ వరుసగా వీడియోలు విడుదల చేస్తున్నారు. రావణ్‌ను (Ravan) అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు.

అయితే ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో, యూట్యూబ్ వేదికగా పలువురు వీడియోలు విడుదల చేస్తుండటంతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment