---Advertisement---

Pralhad Joshi: హస్తినలో కీలక మార్పు.. విద్యాశాఖ అదనపు బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి!

July 26, 2026

Summarize with AI

---Advertisement---

హస్తినలో కేంద్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా (Resignation) అనంతరం కేంద్ర మంత్రివర్గంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) ఇవాళ అధికారికంగా విద్యాశాఖ (Ministry of Education) అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఈ నిర్ణయం దేశ రాజకీయాల్లోనే (Nation Politics) కాకుండా విద్యారంగంలో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu), ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే ఆయన వినియోగదారుల వ్యవహారాలు(Consumer Affairs), ఆహార(Food), ప్రజా పంపిణీ శాఖలతో (Public Distribution Departments) పాటు నూతన, పునరుద్ధరణీయ ఇంధన శాఖ (Energy Ministry) మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీటితో పాటు విద్యాశాఖ (Education Ministry) పగ్గాలు కూడా ఆయన చేతిలోకి రావడంతో ఆయన బాధ్యతలు మరింత పెరిగాయి.

అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలను వేగవంతం చేయడంతో పాటు పోటీ పరీక్షల నిర్వహణలో 100 శాతం పారదర్శకత తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యార్థులు(Students), యువత(Youth) నమ్మకాన్ని మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత విద్యాశాఖకు కొత్త నాయకత్వం రావడం కేంద్ర ప్రభుత్వానికి కీలక పరిణామంగా మారింది. రానున్న రోజుల్లో విద్యా విధానాలు, పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు సంబంధించిన కీలక నిర్ణయాలపై ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment