---Advertisement---

రాహుల్ గాంధీ చెప్పిన ‘16’ సంఖ్య – టీడీపీ పాత్రపై చర్చ ?

April 18, 2026

---Advertisement---

లోక్‌సభలో (Lok Sabha) జరిగిన చర్చల సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రసంగంలో ఉత్సాహం తగ్గిందని పేర్కొన్న ఆయన, దానికి గల కారణం “16” అనే సంఖ్యలో దాగి ఉందని సూచించారు. “ఏప్రిల్ 16 తేదీ… ఆ సంఖ్యలోనే సమాధానం ఉంది” అని చెప్పిన ఈ వ్యాఖ్యలు ఒక రిడిల్ (Riddle) గా మారాయి.

ఈ ‘16’ సంఖ్యను విశ్లేషిస్తూ, బీజేపీ(BJP) నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పరిస్థితులను రాహుల్ గాంధీ పరోక్షంగా ఎత్తిచూపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీకి స్వతంత్ర మెజారిటీ లేకపోవడం, కీలక చట్టాలు ఆమోదించడానికి ప్రత్యేక మెజారిటీ అవసరం వంటి అంశాలు ప్రభుత్వానికి సవాలుగా మారాయి.

ప్రత్యేకంగా టీడీపీకి(TDP) ఉన్న 16 లోక్‌సభ సీట్లు (Lok Sabha seats) కేంద్ర ప్రభుత్వ స్థిరత్వానికి అత్యంత ముఖ్యంగా మారాయి. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీ ప్రస్తావించిన ‘16’ సంఖ్య టీడీపీ మద్దతును సూచిస్తోందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఒకవేళ కీలక అంశాల్లో విభేదాలు తలెత్తితే, టీడీపీ వైఖరి ప్రభుత్వ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇప్పటికే టీడీపీ.. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్నా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో అటు కాంగ్రెస్ పార్టీ తోను రాహుల్ గాంధీతోనూ మంచి సంభందాలే టీడీపీకి ఉన్నాయనే అభిప్రాయం రాజకీయ పార్టీలలో నడుస్తున్న చర్చ.

అయితే టీడీపీ నాయకత్వం మాత్రం ప్రధాని ఇచ్చిన హామీలపై నమ్మకం వ్యక్తం చేస్తూనట్టే కనిపిస్తున్నా, ఆ పార్టీ గత వ్యవహార శైలి నమ్మదగ్గే విధంగా లేదని పలువురు గుర్తు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీ విసిరిన ఈ ‘16’ మిస్టరీ రాజకీయంగా మరింత చర్చకు దారి తీస్తూ, కూటమి రాజకీయాల్లో అంతర్గత సమీకరణాలను వెలుగులోకి తెస్తోందని బావిస్తున్నారు. అటూ బీజేపీ పార్టీ సైతం ఈ వ్యవహారాన్ని సీర్రియస్ గానే ఆలోచన చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్న మాట.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment