---Advertisement---

భూమన అభినయ్ పై రష్మీ వ్యాఖ్యలు చట్టంపై అవగాహనాలేమే కారణమా?

May 2, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న ఒక నిరసన కార్యక్రమం చుట్టూ పెద్ద చర్చ ప్రారంభమైంది. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి (Abhinay Reddy) ఇంధన ధరల పెరుగుదలకు (Fuel Price Hike) వ్యతిరేకంగా చేపట్టిన వినూత్న ర్యాలీ అకారణమైన వివాదానికి దారి తీసింది. ఈ ర్యాలీలో ఆటోను ఎద్దుల బండిపై పెట్టి నిరసన తెలియజేశారు. అయితే ఈ చర్యపై నటి రష్మీ (Rashmi Gautam) స్పందిస్తూ, జంతువులను రాజకీయ నిరసనల కోసం ఉపయోగించడం సరికాదని, ముఖ్యంగా ఆటోను ఎద్దుల బండిపై పెట్టడం క్రూరత్వంగా పరిగణించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారపార్టీ మద్దతుదార్లు ఆమెను సమర్థిస్తుండగా, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో డీజిల్ కొరతతో (Diesel Shortage) రైతులు (Farmers), సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆ సమస్యపై మాట్లాడకుండా, జంతు హక్కుల పేరుతో అసలు అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఇక ఈ ఘటనను చట్టపరంగా పరిశీలిస్తే, “జంతువులపై క్రూరత్వ నిరోధక నిబంధనలు, 1965” ప్రకారం ఎద్దులు లాగే బండిపై మోసే బరువుకు స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. చిన్న ఎద్దులు కూడా కనీసం 1000 కిలోల వరకు బరువును లాగగలవని నిబంధనలు సూచిస్తున్నాయి. బజాజ్ ఆటో రిక్షా ఖాళీ బరువు సుమారు 403 కిలోలు కాగా, ఎద్దుల బండి బరువుతో కలిపినా మొత్తం 600 నుంచి 700 కిలోల మధ్యలోనే ఉంటుంది. ఇది చట్టపరమైన పరిమితికి చాలా తక్కువ.

అందువల్ల, కేవలం బరువు పరంగా చూస్తే అభినయ్ రెడ్డి చేపట్టిన నిరసన చర్య చట్టవిరుద్ధం కాదని భావించవచ్చు. అయితే రాజకీయ నిరసనల్లో వినూత్న పద్ధతుల పేరుతో జంతువులను వినియోగించడం సమంజసమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి భారత చరిత్రలో ఎద్దులు మానవ జీవనంలో భాగంగా ఉన్నాయి. 1973లో పెట్రోల్ మరియు కిరోసిన్ ధరల పెంపునకు నిరసనగా ఎద్దుల బండిపై పార్లమెంటుకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) చేరుకుని నిరసన చేపట్టిన ఘటనను పలువురు గుర్తుచేస్తున్నారు.

ఏది ఏమైనా, ప్రజా సమస్యలపై ప్రతిపక్షం పోరుబాట పట్టినప్పుడు చట్టంపై సరైన అవగాహన లేకుండా సమాజంలో పేరు గడించిన వారు స్పందించడం అనవసర వివాదాలకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment