---Advertisement---

రాయచోటిలో రక్తపాతం – వైసీపీ నేతపై వేట కొడవళ్ళతో దాడికి దిగిన మంత్రి అనుచరులు?

May 3, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) హింసా రాజకీయం మరోసారి పడగ విప్పింది. రాయచోటిలో రాష్ట్ర మంత్రి టీడీపీ నేత రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) అనుచరులు వైఎస్సార్‌సీపీ నేత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిపై (Dasaratha Rami Reddy) వేట కొడవళ్లతో దాడి చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ దాడిలో దశరథరామిరెడ్డి సహా పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

హైకోర్టు స్టే (High Court Stay) ఉన్న స్థల వివాదంలో ‘సెటిల్‌మెంట్’(Settlement) పేరుతో టీడీపీ(TDP) రాజకీయ జోక్యం పెరగడం, అనంతరం హింసాత్మక దాడికి దారితీయడం పాలనా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దశరథరామిరెడ్డికి చెందిన ఆస్తులపై విధ్వంసం జరగడం, వాహనాలు ధ్వంసం చేయడం వంటి చర్యలు ఈ సంఘటనకు ముందస్తు ప్రణాళిక ఉన్నట్టుగా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

కూటమి అధికారంలోకి (Alliance Government) వచ్చాక ఇది ఒక్కటే ఘటన కాదు, వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ (Rasheed) హత్య, పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత కార్యకర్త మందా సాల్మన్ (Manda Salman) హత్య, ఎచ్చెర్ల మండలానికి చెందిన సత్తారు గోపి(Gopi) హత్య, రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య (Lingamayya) హత్య (Murder) ఘటన వంటి అనేక సంఘటనలు రాష్ట్రంలో రాజకీయ హింస పెరుగుతున్నదనడానికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.

ఈ సంఘటనలను విశ్లేషిస్తే అధికార మార్పిడి తర్వాత కూటమి నాయకులకి ప్రతిపక్ష నేతలు లక్ష్యంగా మారారనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం (Red Book Constitution) అంటూ ఒక ప్రమాదకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారని. ఈ పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో శాంతి భద్రతలపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశముందని. కాబట్టి చట్టవ్యవస్థలు కలగచేసుకుని హింసను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment