సోషల్ మీడియా (Social Media) వేదికగా రాజకీయ వాగ్వాదాలు మరింత తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఒక కీలక వివాదం వెలుగులోకి వచ్చింది. బీఎస్ రెడ్డి (BS Reddy) అనే ఫేస్‌బుక్ యూజర్‌తో (Facebook User) పాటు ఎం9 న్యూస్ (M9 News), థింక్ ఆంధ్ర (Think Andhra) వంటి మీడియా చానెళ్లపై వైఎస్సార్‌సీపీ నాయకులు (YSRCP Leaders) తీవ్రంగా మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy), ఆయన సతీమణి వైఎస్ భారతి (YS Bharathi), ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) మరియు ఇతర పార్టీ నాయకులపై అసభ్యకరమైన, అవమానకరమైన మరియు నిరాధార ఆరోపణలతో కూడిన పోస్టులు ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు.
ఈ చర్యలు తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, నాయకుల గౌరవానికి మరియు కార్యకర్తల భావోద్వేగాలకు తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఈ పోస్టులు సమాజంలో ద్వేషం మరియు ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పట్టణంలోని అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో (Urban Police Station) ఫిర్యాదు చేసి, సంబంధిత వ్యక్తులు మరియు మీడియా సంస్థలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోస్టులను వెంటనే తొలగించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వాఖ్యలు చేయడం, అసత్యాలతో కూడిన వదంతులు సృష్టించడం లాంటివి చేస్తే అలాంటి వ్యక్తులపై తమ ప్రభుత్వం ఖటినంగా వ్యవహరిస్తుందని చెప్పుకునే చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో స్పష్టంగా చెప్పాలని పలువురు డీమాండ్ చేస్తుండటం గమనార్హం.







