---Advertisement---

సుగాలి ప్రీతీ కేసులో జనసేన అడ్డగోలు వాదనలు!

May 28, 2026

Summarize with AI

---Advertisement---

గిరిజన బాలిక (Tribal Girl) సుగాలి ప్రీతీ (Sugali Preethi) హత్యాచార కేసు (Rape and Murder Case) మరోసారి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో మొదటి నుంచి నిజాయతీగా పోరాడింది జనసేన పార్టీ (Jana Sena Party) మాత్రమే అని ఆ పార్టీ వర్గాలు కొత్త రాగం ఎత్తుకున్నాయి, ఇప్పుడు ఆ వాదనలపై అనేక ప్రశ్నలు లేవుతున్నాయి. ముఖ్యంగా సుగాలి ప్రీతీ తల్లిగారి వ్యాఖ్యలు, గతంలో జరిగిన పరిణామాలు, ప్రభుత్వ చర్యలు, రాజకీయ పార్టీల వైఖరులు ఇప్పుడు కొత్త చర్చకు కారణమయ్యాయి.

జనసేన వర్గాలు సుగాలి ప్రీతీకి న్యాయం చేయాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 2019 డిసెంబర్ లో భారీ కవాతులు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారని చెబుతున్నాయి. అయితే విమర్శకులు మాత్రం 2017లో జరిగిన ఈ దారుణ ఘటనపై జనసేన 2019 చివరి వరకు బహిరంగంగా పెద్దగా స్పందించలేదని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా, జగన్ ప్రభుత్వం (Jagan Government) అధికారంలోకి వచ్చిన తర్వాతే కేసు పునర్విచారణ ప్రారంభమైందని, 2019 అక్టోబర్ లోనే అదనపు ఎస్పీ స్థాయి అధికారిణి రమాదేవిని నియమించి సిట్ ద్వారా దర్యాప్తు చేపట్టిందని చెబుతున్నారు.

సుగాలి ప్రీతీ తల్లిదండ్రులు కూడా అప్పట్లో జగన్ ప్రభుత్వం విచారణను తిరిగి ప్రారంభించడం స్వాగతించారని, ఆ సమయంలోనే అత్యాచారానికి సంబంధించిన కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ 2019 డిసెంబర్‌లో మొదటిసారి ఈ కేసును ప్రస్తావించారని చెబుతున్నారు. అంతకు ముందే జగన్ తీసుకున్న చర్యలను ఉద్దేశపూర్వకంగా మరుగునపరుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇక పరిహారం అంశంపైనా రాజకీయ ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సుగాలి ప్రీతీ కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం, భూమి, ఇంటి స్థలం వంటి సాయం అందించిందని జనసేన చెబుతుండగా, ప్రత్యర్థులు మాత్రం జనసేన ఎప్పుడైనా 2017 నుండి 2024 వరకు ప్రత్యేకంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం తమంతట తామే ఆ కుటుంబానికి సహాయం అందించిందని, ఇదే తరహాలో ఇతర బాధిత కుటుంబాలకు కూడా సాయం చేసిన ఉదాహరణలు ఉన్నాయని చెబుతున్నారు. జనసేనకి నిజంగా చిత్తశుద్ది ఉంటే 2017-19 మద్య చంద్రబాబుకి (Chandrababu Naidu) చెప్పి ఎందుకు ఇప్పించలేదని నిలదీస్తున్నారు.

సాక్ష్యాల తారుమారుపై కూడా తీవ్ర వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. సుగాలి ప్రీతీ తల్లి చెబుతున్న అనుమానితుల డీఎన్‌ఏ సరిపోలలేదని జనసేన వాదిస్తుండగా, విమర్శకులు మాత్రం 2017లో జరిగిన ఘటనకు సంబంధించిన సాక్ష్యాలు రెండేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండి, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే తారుమారయ్యాయన్న వాదనలో లాజిక్ లేదని అంటున్నారు. అంతేకాకుండా, సుగాలి ప్రీతీ తల్లి స్వయంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సాక్ష్యాలు మార్చేశారని 2019లోనే పవన్ కళ్యాణ్‌కు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

2020 ఫిబ్రవరి 28న జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 37 ద్వారా ఈ కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. సీబీఐ(CBI) కూడా ఈ కేసు తమ వద్దకు వచ్చినట్టు కోర్టులో చెప్పిన నేపథ్యంలో, ‘ఉత్తుత్తి జీవోలు’ అన్న ఆరోపణలపై ప్రశ్నలు వస్తున్నాయి.

ఇక ఇటీవల సుగాలి ప్రీతీ తల్లిగారిపై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిగత దాడులు, ఆమె అవిటితనాన్ని ఎత్తిచూపుతూ జరుగుతున్న విమర్శలు మరింత ఆగ్రహానికి దారితీశాయి. ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారనే విమర్శలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంలో ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment