తమిళనాడులో(Tamil Nadu) ప్రజా రవాణాను (Public Transport) ఆధునికీకరించే దిశగా ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం (State Government) కొనుగోలు చేసే ప్రతి కొత్త ప్రభుత్వ బస్సు (Government Bus) ఎయిర్ కండీషనింగ్ (ఏసీ) (AC) సౌకర్యంతోనే ఉంటుందని రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ (Vijay Tamizhan Parthiban) వెల్లడించారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన రవాణా సేవలు విస్తరించడమే ఈ నిర్ణయం లక్ష్యమని తెలిపారు.
సేలంలో మీడియాతో మాట్లాడిన మంత్రి పార్థిబన్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఆధునిక సదుపాయాలతో కూడిన బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం విజయ్(CM Vijay) ఆదేశించినట్లు చెప్పారు. ఇటీవల సీఎం స్వయంగా ప్రభుత్వ బస్సులో ప్రయాణించి ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించిన అనంతరం, కొత్తగా కొనుగోలు చేసే ప్రతి బస్సులో తప్పనిసరిగా ఏసీ (Air Conditioning – AC) సౌకర్యం ఉండాలని సూచించినట్లు వెల్లడించారు.
ఇటీవల రూ.127.21 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 300 కొత్త ప్రభుత్వ బస్సులను సీఎం విజయ్ ప్రారంభించారు. వీటిలో 164 డీజిల్ బస్సులు(Diesel Buses), 136 బీఎస్-6 (BS-VI) ప్రమాణాలకు అనుగుణమైన సీఎన్‌జీ బస్సులు (CNG Buses)ఉన్నాయి. ప్రస్తుతం ఇవి చెన్నైతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి.
ప్రజా రవాణాను పూర్తిస్థాయిలో ఆధునీకరించడం, రాష్ట్రవ్యాప్తంగా మెరుగైన అనుసంధానం కల్పించడం, ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రమాణాల సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఇకపై అన్ని కొత్త ప్రభుత్వ బస్సులు ఏసీతోనే రానుండటంతో తమిళనాడు రవాణా రంగంలో ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.








