తమిళనాడులో(Tamil Nadu) అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి విజయ్(CM Vijay) వరుస సంక్షేమ నిర్ణయాలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా మరో చారిత్రాత్మక పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి నవజాత శిశువుకు (Every Newborn Baby) 1 గ్రాము (1 Gram) బంగారు ఉంగరాన్ని(Gold Ring) ఉచితంగా అందించే “తాయ్‌మామన్ తంగ మోధిరం తిట్టం” (Thaimaman Thanga Modhiram Thittam) పేరుతో కొత్త పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని సెప్టెంబర్ 15 నుంచి ముఖ్యమంత్రి విజయ్(CM Vijay) ప్రారంభించనున్నారు. తమిళ సంప్రదాయంలో పుట్టిన బిడ్డకు మేనమామ అందించే కానుకకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ సంప్రదాయానికి ప్రతీకగా ఈ పథకానికి “తాయ్‌మామన్ తంగ మోధిరం తిట్టం” అనే పేరు పెట్టారు. దీంతో సంప్రదాయాన్ని కొనసాగించడమే కాకుండా ప్రతి కుటుంబానికి(Every Family) ప్రభుత్వ తరఫున ప్రత్యేక గుర్తింపును అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం 1 గ్రాము బంగారు ఉంగరం విలువ సుమారు రూ.13,600గా అంచనా వేస్తున్నారు. ఈ భారీ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.755.83 కోట్ల నిధులను కేటాయించింది. పథకం అమలులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనుంది.
ఈ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్‌ను (State Project Management Unit – SPMU) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పథకం అమలు, నిధుల వినియోగం, అర్హుల గుర్తింపు, ఉంగరాల పంపిణీ వంటి అన్ని అంశాలను ఈ విభాగం పర్యవేక్షించనుంది.
ఈ పథకంలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే ఎలాంటి పరిమితులు లేకుండా ప్రతి అర్హమైన నవజాత శిశువుకు బంగారు ఉంగరం అందించనున్నారు. ఆడపిల్ల, మగపిల్ల అనే లింగ వివక్ష ఉండదు. అలాగే ఇది మొదటి బిడ్డా, రెండో బిడ్డా అనే నిబంధనలు కూడా వర్తించవు. ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన ప్రతి శిశువు ఈ పథకానికి అర్హుడే.
ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించిన ఈ వినూత్న సంక్షేమ పథకం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నవజాత శిశువుకు జన్మించిన తొలి రోజే ప్రభుత్వం నుంచి బంగారు కానుక అందించే ఈ పథకం భారతదేశంలోనే అరుదైన సంక్షేమ కార్యక్రమంగా గుర్తింపు పొందుతోంది.








