---Advertisement---

టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా ‘శుభదీప్ ఘోష్’ నియామకం..!

August 3, 2026

Summarize with AI

---Advertisement---

టీమిండియా (Team India) సపోర్ట్ స్టాఫ్‌లో (Support Staff) కీలక మార్పు చోటుచేసుకుంది. భారత (India) పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు (Men’s Senior Cricket Team) కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా (Fielding Coach) అస్సాంకు (Assam) చెందిన మాజీ డొమెస్టిక్ క్రికెటర్ శుభదీప్ ఘోష్‌ను (Shubhadeep Ghosh) బీసీసీఐ(BCCI) అధికారికంగా నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన టి. దిలీప్ (T. Dilip) కాంట్రాక్ట్ ముగియడంతో ఆయన స్థానాన్ని శుభదీప్ భర్తీ చేయనున్నారు. శ్రీలంక (Sri Lanka) పర్యటనలో జరిగే 2 టెస్టుల సిరీస్‌తో ఆయన టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌లో చేరి ఇవాళ నుంచే బాధ్యతలు చేపట్టనున్నారు.

శుభదీప్ ఘోష్ అస్సాంలోని దిగ్‌బోయ్‌కు చెందిన మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్నర్‌గా అస్సాం, రైల్వేస్ జట్ల తరఫున 17 ఫస్ట్ క్లాస్, 17 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచింగ్‌పై దృష్టి పెట్టిన ఆయన గత 6 నుంచి 7 సంవత్సరాలుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్‌గా సేవలందిస్తున్నారు.

జాతీయ స్థాయిలో పలు కీలక ప్రాజెక్టుల్లో భాగమైన శుభదీప్ ఘోష్‌కు (Shubhadeep Ghosh) ఇప్పటికే మంచి కోచింగ్ అనుభవం ఉంది. 2021లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశారు. అలాగే 2024లో దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత అండర్-19 జట్టుతో పాటు ఇండియా-ఏ జట్టుకు కూడా సేవలందించారు.

ఆధునిక ఫీల్డింగ్ టెక్నిక్స్, క్యాచింగ్ నైపుణ్యాలు, ఆటగాళ్ల అథ్లెటిజాన్ని మెరుగుపరచడంలో శుభదీప్ ఘోష్‌కు ఉన్న ప్రత్యేక అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ ఆయనకు ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. ఇప్పుడు శ్రీలంక టూర్‌తో ఆయన కొత్త ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment