తిరుమలలో (Tirumala) భక్తుల కోసం ఉన్న పవిత్ర వాతావరణం మధ్య దళారీ వ్యవస్థ పాతుకుపోయిందా? విజయవాడకు (Vijayawada) చెందిన భక్తుడు సుధాకర్ (Sudhakar) చేసిన ఆరోపణలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆయన చెప్పిన విషయాలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
సుధాకర్ మాట్లాడుతూ తాను ఎలాంటి రాజకీయ పార్టీలకు చెందినవాడు కాదని, కుటుంబంతో కలిసి భక్తుడిగా తిరుమలకు వెళ్లానని తెలిపారు. అయితే అక్కడ ఎదురైన అనుభవం పూర్తిగా నిరాశ కలిగించిందని చెప్పారు.
తిరుమలలో రూమ్ కేటాయింపులు(Room Allotments), లాకర్ సదుపాయాలు (Locker Facilities) సాధారణ భక్తులకు (Common Devotees) అందుబాటులో లేకుండా దళారుల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. డబ్బు చెల్లించిన వారికి మాత్రమే ఈ సదుపాయాలు లభిస్తున్నాయని, ఇది ఒక పెద్ద వ్యాపారంగా మారిందని విమర్శించారు.
ఇంకా సంచలనంగా, ఈ దందాల్లో విజిలెన్స్ సిబ్బంది (Vigilance Staff) కూడా భాగస్వాములే అన్న ఆరోపణలు చేశారు. దీంతో భక్తుల్లో అనుమానాలు మరింత పెరిగాయి.
రాజకీయ అంశాలను కూడా ప్రస్తావించిన సుధాకర్, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ప్రభుత్వ కాలంలో పరిస్థితులు మెరుగ్గా ఉండేవని అన్నారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) నేతలు చేసిన ఆరోపణలు పరిస్థితిని మార్చేశాయని వ్యాఖ్యానించారు.
ఇప్పటికైనా (Tirumala Tirupati Devasthanams) పాలక మండలి స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చైర్మన్ బిఆర్ నాయుడు (BR.Naidu) వ్యాపారవేత్త కావడంతో భక్తుల సమస్యలపై సరైన దృష్టి లేదని విమర్శించారు.
తిరుమల కొండపై జరుగుతున్న ఈ దందాలపై జేఈవో కార్యాలయానికి (JEO Office) లేఖ కూడా అందజేశానని సుధాకర్ తెలిపారు. ఈ ఆరోపణలపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






