---Advertisement---

TMC Rebellion: మమతా బెనర్జీకి భారీ షాక్.. 20 మంది ఎంపీల తిరుగుబాటు.. ఎన్డీఏకు మద్దతు!

June 9, 2026

Summarize with AI

---Advertisement---

పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి (Mamata Banerjee) రాజకీయంగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల (State Assembly MLAs) తిరుగుబాటు (Rebellion) కలకలం రేపగా, ఇప్పుడు అదే అసంతృప్తి ఢిల్లీలోని పార్లమెంట్‌కు చేరింది. టీఎంసీకి చెందిన 28 మంది లోక్‌సభ ఎంపీల్లో ఏకంగా 20 మంది పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఈ 20 మంది ఎంపీలు(MPs) కేంద్రంలోని బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి(NDA) మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం మరింత చర్చనీయాంశమైంది. ఢిల్లీలో (Delhi) జరిగిన ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) హాజరైన రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహిస్తున్న లోక్‌సభ (Lok Sabha) ఎంపీ కాకలి ఘోష్ దస్తీదార్ (Kakoli Ghosh Dastidar) మీడియా ముందుకు వచ్చి తమ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించారు. తమతో పాటు దాదాపు 20 మంది ఎంపీలు ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లాకు (Om Birla) లేఖ కూడా పంపినట్లు చెప్పారు. అయితే తాము ప్రస్తుతం బీజేపీలో చేరబోవడం లేదని, పశ్చిమ బెంగాల్ అభివృద్ధి కోసమే ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమ వాదన వినిపించేందుకు సమయం కోరుతున్నారు. ముఖ్యంగా లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్‌గా కాకలి ఘోష్ దస్తీదార్‌ను (Kakoli Ghosh Dastidar) కొనసాగించాలన్నది వారి ప్రధాన డిమాండ్‌గా తెలుస్తోంది. అయితే అధికారిక టీఎంసీ వర్గం మాత్రం పూర్తి భిన్నమైన వాదనను ముందుకు తెచ్చింది.

కాకలి ఘోష్‌ను చీఫ్ విప్ (Chief Whip) పదవి నుంచి ఇప్పటికే తొలగించామని, ఆమె స్థానంలో కళ్యాణ్ బెనర్జీని (Kalyan Banerjee) నియమించామని మమతా వర్గం చెబుతోంది. ఈ మార్పుకు సంబంధించి మే 20నే లోక్‌సభ సెక్రటేరియట్‌కు అధికారిక లేఖ పంపినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. మే 29 తేదీతో స్పీకర్ కార్యాలయం రిసీవ్డ్ స్టాంప్ ఉన్న లేఖ కాపీలను కూడా బయటపెట్టారు. ఎంపీ కీర్తి ఆజాద్ (Kirti Azad) కూడా ఇదే విషయాన్ని సమర్థించారు. దీంతో ఇప్పుడు స్పీకర్ ముందున్న ప్రధాన వివాదం చీఫ్ విప్ పదవిపైనే కేంద్రీకృతమైంది.

ఇక పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం Anti-Defection Law) నుంచి బయటపడేందుకు కూడా తిరుగుబాటు ఎంపీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వారు నేరుగా టీఎంసీకి రాజీనామా చేయడం కానీ, బీజేపీలో చేరడం కానీ చేయడం లేదు. పార్లమెంట్‌లో ప్రత్యేక గ్రూప్‌గా (Separate Group) కొనసాగుతూ బయట నుంచి ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం బసిర్‌హాట్ ఎంపీ హాజీ నూరుల్ ఇస్లాం (Haji Nurul Islam) మరణంతో టీఎంసీకి లోక్‌సభలో 28 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. చట్టపరంగా అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం. ఆ లెక్కన కనీసం 19 మంది ఎంపీలు అవసరం కాగా, ఇప్పుడు 20 మంది తిరుగుబాటు చేయడంతో వారు సురక్షిత సంఖ్యను దాటేశారు. దీంతో ఈ ఎంపీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం మమతా బెనర్జీకి అంత సులభం కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment