దులీప్ ట్రోఫీలో(Duleep Trophy) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) గాయంతో (Injury) మైదానాన్ని వీడటంతో.. జట్టు నాయకత్వ బాధ్యతలు వైభవ్ సూర్యవంశీకి అప్పగించారు.
ఇప్పటివరకు తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న వైభవ్.. తొలిసారి దేశవాళీ క్రికెట్లో ఓ జట్టుకు కెప్టెన్‌గా (Captain) వ్యవహరించడం విశేషంగా మారింది. కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న వెంటనే ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా చిరునవ్వుతో మైదానంలోకి వచ్చిన వైభవ్.. జట్టును ముందుండి నడిపించాడు.
మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో (International Cricket) ఎంతో అనుభవం ఉన్న మహమ్మద్ షమీ(Mohammed Shami), ముకేశ్ కుమార్(Mukesh Kumar) వంటి సీనియర్ బౌలర్లకు వైభవ్ సూచనలు చేస్తూ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న వయసులోనే సీనియర్ ఆటగాళ్లకు ఫీల్డింగ్ మార్పులు, బౌలింగ్‌కు సంబంధించిన సూచనలు చేస్తూ జట్టును నడిపించిన అతడి తీరు అభిమానులను ఆకట్టుకుంది.
వైభవ్ సూర్యవంశీ నాయకత్వంలో సీనియర్ ఆటగాళ్లు కూడా అతడి సూచనలను పాటిస్తూ కనిపించడంతో ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇంత చిన్న వయసులోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి షమీ, ముకేశ్ వంటి అనుభవజ్ఞులను సమన్వయం చేయడం నిజంగా ఆసక్తికరంగా ఉందంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.







